AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okinava Electric Scooter: యాప్‌తోనే స్కూటర్‌ని కంట్రోల్‌ చేయొచ్చు.. ఒకినావా అప్‌గ్రేడెడ్‌ స్కూటర్‌.. ఇది సమ్‌థింగ్‌ స్పెషల్‌..

అప్‌గ్రేడెడ్‌ ఒకి-90 స్కూటర్లో డిజిటల్‌ స్పీడో మీటర్‌ ఉంటుంది. బిల్ట్‌ ఇన్‌ నావిగేషన్‌ సిస్టమ్‌ ఉంటుంది. బ్లూటూత్‌ కనెక్టివిటీ, కాల్‌ నోటిఫికేషన్లు, అలెర్ట్స్‌, టైం డిస్‌ ప్లే, మ్యూజిక్‌ నోటిఫికేషన్లు తెలిపే సాంకేతికత జోడించారు. అంతేకాక మొబైల్‌ యాప్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు.

Okinava Electric Scooter: యాప్‌తోనే స్కూటర్‌ని కంట్రోల్‌ చేయొచ్చు.. ఒకినావా అప్‌గ్రేడెడ్‌ స్కూటర్‌.. ఇది సమ్‌థింగ్‌ స్పెషల్‌..
Okinava Okhi 90
Madhu
|

Updated on: Jul 21, 2023 | 4:30 PM

Share

ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలు నూతన ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి కొత్త కొత్త ఉత్పత్తులు, అత్యాధునిక ఫీచర్లతో లాంచ్‌ అవుతున్న విద్యుత్‌ శ్రేణి స్కూటర్లు, బైక్‌లు వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అప్‌ గ్రేడ్‌ చేస్తున్నాయి. కొత్త ఫీచర్లను జోడిస్తున్నాయి. బ్యాటరీ కెపాసిటీని పెంచుతున్నాయి. లుక్‌ లో కూడా కొన్ని మార్పులు చేసి సరికొత్తగా వాటిని లాంచ్‌ చేస్తున్నాయి. ఇలాగే ఒకినావా ఆటోటెక్‌ తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అప్‌ గ్రేడ్‌ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఒకి-90 మోడల్‌ స్కూటర్‌కి ఏఐఎస్‌-156 సవరణ చేపట్టింది. కంప్లిమెంటరీ బ్యాటరీ ప్యాక్‌, నెక్ట్స్‌ జెన్‌ మోటార్‌, అడ్వాన్స్‌డ్‌ కనెక్టివిటీ ఫీచర్లను తీసుకొచ్చింది. ఇవి వినియోగదారులకు మంచి డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తాయడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఒకి-90 స్కూటర్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకి-90 కనెక్టివిటీ ఇలా..

అప్‌గ్రేడెడ్‌ ఒకి-90 స్కూటర్లో డిజిటల్‌ స్పీడో మీటర్‌ ఉంటుంది. బిల్ట్‌ ఇన్‌ నావిగేషన్‌ సిస్టమ్‌ ఉంటుంది. బ్లూటూత్‌ కనెక్టివిటీ, కాల్‌ నోటిఫికేషన్లు, అలెర్ట్స్‌, టైం డిస్‌ ప్లే, మ్యూజిక్‌ నోటిఫికేషన్లు తెలిపే సాంకేతికత జోడించారు. అంతేకాక మొబైల్‌ యాప్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ రియల్‌ టైం ఎస్‌ఓసీ మోనిటరింగ్‌ చేసుకోవచ్చు. స్పీడ్‌ను కూడా మోనిటరింగ్‌ చేసుకునే ఫీచర్‌ ఉంటుంది.

ఒకి-90 పనితీరు ఇలా..

కొత్తగా తీసుకొచ్చిన ఈ ఒకి-90 స్కూటర్‌ను మన దేశంలోని రోడ్ల పరిస్థితికి అనుగుణంగా తీర్చిదిద్దారు. 175ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉంటుంది. దీనిలో మైక్రో చార్జర్‌ ఉంటుంది. దీనిలో ఆటో కట్‌ ఫంక‌్షన్‌ ఆప్షన్‌ ఉంటుంది. రీజనరేటివ్‌ ఎనర్జీతో కూడిన ఎలక్ట్రోనిక్‌ అసిస్టెంట్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌(ఈ-ఏబీఎస్‌)ను అందించారు. ఇది గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలోని బ్యాటరీ సింగిల చార్జ్‌ పై 160 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒకి-90 కొత్త ఫీచర్లు ఇలా..

ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లో జీపీఎస్‌ సెన్సింగ్‌, రియల్‌ టైం పొజిషనింగ్‌, జియో ఫెన్సింగ్‌, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన అసిస్టెన్స్‌ అధునాతన ఫీచర్లు ఉంటాయి. ఈ స్కూటర్‌ ని ఏ మొబైల్‌ కన్నా కనెక్ట్‌ చేసుకోవచ్చు. మొబైల్‌లో ఒకినావా కనెక్ట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని స్కూటర్‌ను కంట్రోల్‌ చేయొచ్చు.దీనిలో సేఫ్టీ కోసం విభిన్న రకాల సెన్సార్లు, ఇంటెలిజెంట్‌ ఫీచర్లు ఉన్నాయి. ఇది వెనుకకు వెళ్లేటప్పుడు, పార్కింగ్‌ చేసేటప్పుడు బాగా ఉపకరిస్తాయి. యాంటీ థెఫ్ట్‌ అలారం ఉంటుంది. వాస్తవానికి ఒకి-90 స్కూటర్‌ 2022లో లాంచ్‌ అయ్యింది. లాంచ్‌ మొదటి నెలలోనే 10,000పైగా యూనిట్లు బుక్‌ అయ్యాయి. కాగా కొత్తగా అప్‌గ్రేడ్‌ అయిన స్కూటర్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇష్టంగా లెగ్ పీస్ తింటున్నారా.. అమ్మ బాబోయ్.. యమ డేంజర్
ఇష్టంగా లెగ్ పీస్ తింటున్నారా.. అమ్మ బాబోయ్.. యమ డేంజర్
ఖర్జూరం.. బాదం.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
ఖర్జూరం.. బాదం.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్‌ ఆలోచన
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్‌ ఆలోచన
వెన్నెల వెలుగుల్లో విహారం.. భారత్‌లో కొత్త ట్రెండ్ 'నైట్ టూరిజం'!
వెన్నెల వెలుగుల్లో విహారం.. భారత్‌లో కొత్త ట్రెండ్ 'నైట్ టూరిజం'!
డబుల్ మనీ అంటూ రూ.33 లక్షలు టోకరా.. పేపర్ బండిల్స్ ఇచ్చి..
డబుల్ మనీ అంటూ రూ.33 లక్షలు టోకరా.. పేపర్ బండిల్స్ ఇచ్చి..
అంగన్వాడీ బాలామృతంతో బిస్కెట్స్..సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేయాలంటే
అంగన్వాడీ బాలామృతంతో బిస్కెట్స్..సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేయాలంటే
అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీనిని అడ్డుకోలేమా..
అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీనిని అడ్డుకోలేమా..
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..18 నెలల పాటు ఉచితంగా జెమిని AI ప్రో
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..18 నెలల పాటు ఉచితంగా జెమిని AI ప్రో
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
డొక్కా సీతమ్మ‌ జీవిత చరిత్ర‌పై విజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన..
డొక్కా సీతమ్మ‌ జీవిత చరిత్ర‌పై విజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన..