Silver Price Today: భారీ పెరుగుదల తర్వాత శాంతిస్తోన్న వెండి ధరలు.. వరుసగా రెండో రోజు స్థిరంగా సిల్వర్‌ రేట్స్‌..

|

Mar 07, 2022 | 6:38 AM

Silver Price Today: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య నెలకొన్న అనిశ్చిత్తి వాతావరణం (Ukraine russia issue) నేపథ్యంలో బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగిన విషయం తెలిసిందే. భారత్‌లో (Silver Price in India) కిలో వెండి ధర ఏకంగా రూ. 70,000 మార్కుకు చేరుకుంది. మార్చి 2వ తేదీ నుంచి..

Silver Price Today: భారీ పెరుగుదల తర్వాత శాంతిస్తోన్న వెండి ధరలు.. వరుసగా రెండో రోజు స్థిరంగా సిల్వర్‌ రేట్స్‌..
Silver Price
Follow us on

Silver Price Today: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య నెలకొన్న అనిశ్చిత్తి వాతావరణం (Ukraine russia issue) నేపథ్యంలో బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగిన విషయం తెలిసిందే. భారత్‌లో (Silver Price in India) కిలో వెండి ధర ఏకంగా రూ. 70,000 మార్కుకు చేరుకుంది. మార్చి 2వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు కేవలం నాలుగు రోజుల్లోనే కిలో వెండి ధర ఏకంగా రూ. 5000 పెరిగడం గమనార్హం. అయితే ఇలా భారీగా పెరిగిన సిల్వర్ రేట్స్ గత రెండు రోజులుగా మాత్రం శాంతించినట్లు కనిపిస్తోంది. ఆదివారం వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేనట్లే సోమవారం కూడా సిల్వర్‌ రేట్స్‌ స్థిరంగా కొనసాగాయి. నేడు దేశంలోని పలు ప్రధాన నగారల్లో సిల్వర్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం కిలో వెండి ధర రూ. 70,000 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో సోమవారం కిలో వెండి ధర రూ. 70,000 గా నమోదైంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,400 గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,400 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 73,400 గా ఉంది.

* విజయవాడలో సోమవారం కిలో వెండి ధర రూ. 73,400 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 73,400గా నమోదైంది.

Also Read: Ind Vs Sl: శ్రీలంకపై సూపర్‌ విక్టరీ.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఎంతంటే..

Ind Vs Sl: శ్రీలంకపై సూపర్‌ విక్టరీ.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఎంతంటే..

Viral Video: కారు వేగంతో జింక పోటీ.. చిరుతను మించిన వేగంతో !! వీడియో