Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. తగ్గిన వెండి ధరలు. కిలో వెండిపై ఏకంగా రూ. వెయ్యికిపైగా..

|

Dec 01, 2021 | 8:23 AM

Silver Price Today: వెండి కూడా బంగారం బాటలోనే ప్రయణిస్తోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన వెండి ధర బుధవారం తగ్గుముఖం పట్టింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధర తగ్గింది. మరీ ముఖ్యంగా..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. తగ్గిన వెండి ధరలు. కిలో వెండిపై ఏకంగా రూ. వెయ్యికిపైగా..
Today Silver Price
Follow us on

Silver Price Today: వెండి కూడా బంగారం బాటలోనే ప్రయణిస్తోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన వెండి ధర బుధవారం తగ్గుముఖం పట్టింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధర తగ్గింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండిపై రూ. వెయ్యికిపైగా తగ్గింది. మరి నేడు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఓసారి చూసేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో నిన్నటితో పోల్చితే కిలో వెండి ధర రూ. 800 తగ్గి, రూ. 61,900 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా రూ. 800 తగ్గిన కేజీ సిల్వర్‌ రూ. 61,900గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండిపై ఏకంగా రూ. 1100 తగ్గింది. ఇక్కడ బుధవారం కిలో వెండి ధర రూ. 66,500గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండిపై రూ. 800 తగ్గి, రూ. 61,900 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో కూడా కిలో వెండిపై రూ. 1100 తగ్గి, రూ. 66,500గా మారింది.

* విజయవాడలో కిలో వెండి ధర రూ. 66,500 వద్ద కొనసాగుతోంది.

* సాగర నగరం విశాఖలోనూ కిలో వెండి ధర రూ. 66,500గా నమోదైంది.

Also Read: Gun Fire: అమెరికాలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‎లో కాల్పులు.. ముగ్గురు విద్యార్థులు మృతి.. పోలీసుల అదుపులో నిందితుడు..

Gun Fire: అమెరికాలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‎లో కాల్పులు.. ముగ్గురు విద్యార్థులు మృతి.. పోలీసుల అదుపులో నిందితుడు..

Telangana News: మంత్రాలతో తమ బిడ్డ చంపేశాడంటూ ఆరోపణలు.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..!