Gold Price Today: ఆకాశనంటుతోన్న బంగారం ధరలు.. మరోసారి భారీగా పెరిగిన రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

. గడిచిన మూడు రోజులుగా  జెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న గోల్డ్‌ రేట్‌ ఇవాళ (డిసెంబర్‌ 31) కూడా భారీగా పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.300 నుంచి రూ.330 వరకు పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50,350కు లభిస్తోంది.

Gold Price Today: ఆకాశనంటుతోన్న బంగారం ధరలు.. మరోసారి భారీగా పెరిగిన రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price Today

Updated on: Dec 31, 2022 | 6:32 AM

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో రోజురోజుకూ పసిడి ధరలు కొండెక్కుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా  జెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న గోల్డ్‌ రేట్‌ ఇవాళ (డిసెంబర్‌ 31) కూడా భారీగా పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.300 నుంచి రూ.330 వరకు పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50,350కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,930గా ఉంది. మరోవైపు వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. కిలో వెండిపై రూ.1000 పెరగడం గమనార్హం. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 71,300 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,930 పలుకుతోంది.
విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,930 కులభిస్తోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,980 వద్ద ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,790వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,080 ఉంది
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 పలుకుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,930 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ50,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,930 గా ఉంది.

వెండి ధరలిలా..

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. గురువారం దేశవ్యాప్తంతా దాదాపు అన్ని నగరాల్లో వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. కేజీ సిల్వర్‌పై సుమారు రూ. 1000 మేర పెరిగింది. మరి ఈరోజు పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,300 కాగా, ముంబైలో రూ. 71,300 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 74,500 వద్ద కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us