Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు ఊరట.. స్థిరంగా ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

పసిడితో పాటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,850కు లభిస్తోంది.

Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు ఊరట.. స్థిరంగా ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Today Gold Price

Updated on: Dec 26, 2022 | 6:27 AM

బంగారం ప్రియులకు కాస్త ఊరట. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలు ఇవాళ (డిసెంబర్‌ 26) మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడితో పాటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,850కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,380గా ఉంది. అలాగే దేశీయ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 71,100 గా పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,380 పలుకుతోంది.
  • విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 కులభిస్తోంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,410 ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,400వద్ద కొనసాగుతోంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,530 ఉంది
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 పలుకుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 గా ఉంది.

వెండి ధరలిలా..

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి రేట్లు ఇలా ఉన్నాయి. చైన్నైలో కిలో వెండి ధర రూ.74,000, ముంబైలో రూ.71,100, ఢిల్లీలో రూ.71,100, హైదరాబాద్‌లో రూ.74,000, కోల్‌కతాలో రూ.71,100, బెంగళూరులో రూ.74,000, విజయవాడలో రూ.74,000 పలుకుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us