Credit Card EMI: క్రెడిట్ కార్డు EMI తో షాపింగ్ చేస్తున్నారా? అయితే ముందు ఇవి తెలుసుకోండి!

చేతిలో డబ్బు లేనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు పనికొస్తుంది. అలాగే ఈఎమ్ఐల ద్వారా ప్రతినెలా కొంత మొత్తం చెల్లించడం చాలామందికి అనుకూలంగా ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు ఈఎమ్ఐ వాడేముందు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Card EMI: క్రెడిట్ కార్డు EMI తో షాపింగ్ చేస్తున్నారా? అయితే ముందు ఇవి తెలుసుకోండి!
Credit Card Emi 5

Updated on: Oct 29, 2025 | 5:08 PM

ఏదైనా షాపింగ్ లేదా కొనుగోలు చేసినప్పుడు చాలామంది క్రెడిట్ కార్డుతో  పేమెంట్ చేసి దాన్ని ఈఎమ్ఐగా మార్చుకుంటుంటారు.  క్రెడిట్‌ కార్డులు అందించే ప్రయోజనాల్లో ఈఎంఐ ఆప్షన్‌ చాలా ఉపయోగకరమైందని చెప్పొచ్చు. అయితే క్రెడిట్ కార్డు ఈఎంఐకు సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తెలుసుకోకుండా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా కొన్నిసార్లు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే క్రెడిట్ కార్డు ఈఎమ్ఐ తీసుకునే ముందు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ లేదా  ఫోర్‌క్లోజర్ ఛార్జీల గురించి తెలుసుకోవాలి.

వీటిని చెక్ చేశాకే..

సాధారణంగా క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు, కార్డు రకాన్ని బట్టి వడ్డీరేట్లను మారుస్తుంటాయి. అలాగే కొన్నింటికి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇది ఒకసారి మాత్రమే చెల్లించాలి. అలాగే ఈఎమ్ఐ కాలపరిమితికి ముందే క్రెడిట్ చెల్లించాలనుకుంటే ముందస్తు చెల్లింపు ఛార్జీలు వర్తిస్తాయి. వీటన్నింటినీ చెక్ చేసుకుని ఏ కార్డులో తక్కువ ఛార్జీలు ఉన్నాయో వాటిని ఎంచుకోవడం బెటర్. అలాగే క్రెడిట్ కార్డు విషయంలో ఎక్కువ టైం పీరియడ్ ఎంచుకుంటే తక్కువ వడ్డీ రేటు పడుతుంది. కానీ దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు ‘నో కాస్ట్ ఈఎమ్ఐ’ ఆప్షన్ ను అందిస్తాయి. అంటే వీటిపై ఎలాంటి వడ్డీ ఉండదు. తీసుకున్న మొత్తాన్ని ఈఎమ్ఐల రూపంలో తిరిగి చెల్లిస్తే చాలు.

టెన్యూవర్ ఇలా..

ఇకపోతే ఏఎమ్ఐ టెన్యూవర్‌‌ను వెసులుబాటుకు అనుగుణంగా ఎంచుకోవాలి. ఎక్కువ ఈఎమ్ఐ చెల్లించలేము అనుకుంటే  ఎక్కువ నెలలను ఎంచుకోవాలి. కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు షాపింగ్ పై క్యాష్‌బ్యాక్/రివార్డ్‌లను అందిస్తుంటాయి.  అలాంటి కార్డులను ఎంచుకుంటే మరోసారి షాపింగ్ చేసినప్పుడు డిస్కౌంట్స్, రివార్డ్స్ లాంటి  ప్రయోజనాలను పొందొచ్చు. క్రెడిట్ కార్డు బిల్లును ఈఎమ్ఐ కిందకు మార్చుకుంటే.. ఎంత మొత్తం వాడుకున్నారో అంత క్రెడిట్ లిమిట్ తగ్గుతుంది. ఈఎమ్ఐల రూపంలో చెల్లిస్తూ ఉంటే మళ్లీ పెరుగుతుంటుంది. కాబట్టి ఈఎమ్ఐలు పూర్తయ్యే వరకు తక్కువ క్రెడిట్ లిమిట్‌తో సర్దుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.