
ఆదాయపు పన్ను చెల్లించడం అనేది దేశ పౌరుల ప్రధాన బాధ్యత. ప్రజలకు వచ్చే ఆదాయం ప్రకారం ట్యాక్స్ ఎంత కట్టాలో నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు ముందస్తుగా ట్యాక్స్ చెల్లిస్తారు. దీనిని అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. ఆ తర్వాత ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) సమర్పించాలా, లేదా అనే ప్రశ్న కలుగుతుంది. దీని గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుందాం. ముందస్తు పన్ను చెల్లించడంలో నిర్లక్ష్యంగా ఉంటే జరిమానాలు, వడ్డీ చార్జీలు విధించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆదాయపు పన్ను చెల్లించే వారందరూ ఐటీఆర్ సమర్పించడం అవసరం.
ఆదాయపు పన్నుశాఖకు మీరు మీ ఆదాయానికి సంబంధించి సమర్పించే ఫారమ్ నే ఐటీఆర్ అంటారు. నిర్థిష్ట కాలానికి మీరు సంపాదించే ఆదాయం, అలాగే పన్నుల వివరాలు దానిలో ఉంటాయి. ఆదాయపు పన్ను కట్టేవారందరూ ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా ముఖ్యం. మీ పన్ను బాధ్యతను తెలియజేస్తుంది. అలాగే మీ ఆదాయ వనరులు, క్లెయిమ్ చేసుకున్న తగ్గింపుల ఆధారంగా మీరు చెల్లించాల్సిన ఆదాయపు పన్నును నిర్ణయించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది. ముందస్తు చెల్లింపులో భాగంగా మీరు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ పన్ను కడితే, ఐటీఆర్ సమర్పించి, ఆ సొమ్మును ఆదాయపు పన్ను శాఖ నుంచి రీఫండ్ చేసుకోవచ్చు.
దేశంలోని పన్నుల వ్యవస్థకు సంబంధించి ఐటీఆర్, అడ్వాన్స్ ట్యాక్స్ చాలా ముఖ్యమైనవి. రెండు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఐటీఆర్ అనేది వ్యక్తులు, సంస్థలు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన అధికారిక ప్రకటన అని చెప్పవచ్చు. ఆర్థిక సంవత్సరంలో వారు ఆర్జించిన ఆదాయాన్ని అది తెలియజేస్తుంది. అడ్వాన్స్ ట్యాక్స్ అనేది చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్నును సంవత్సరాంతంలో ఒకేసారి కాకుండా వాయిదాలలో కట్టే విధానం అని చెప్పుకోవచ్చు.
ఐటీ శాఖ ప్రకారం గరిష్ట మినహాయింపు పరిమితిని మించి ఆదాయం కలిగిన ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం తప్పనిసరి. ఈ క్రింది తెలిపిన వారు ముందస్తుగా పన్ను చెల్లించినా ఐటీఆర్ తప్పనిసరిగా సమర్పించాలి.
పెన్షన్ ఆదాయం కలిగిన సీనియర్ సిటిజన్లకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వీరి ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించిపోయినప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయడం నుంచి తప్పించారు. 75 ఏళ్లు దాటిన వారు తాము పెన్షన్ తీసుకునే బ్యాంకు నుంచి వడ్డీ రూపంలో ఆదాయం పొందుతుంటే ఈ నిబంధన వర్తిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..