Loans: మీకు వచ్చే అద్దె నుంచి రుణం పొందొచ్చు తెలుసా? డబుల్ ఆఫర్ ఇలా..

అద్దె ఆదాయంపై తీసుకునే రుణం యజమానులకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఇళ్లకు మరమ్మతులు చేసుకోవడం, వివిధ పెట్టుబడుల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగపడుతుంది. అద్దె ఆదాయంపై రుణం అంటే ఆస్తి నుంచి వస్తున్న అద్దెను తాకట్టు పెట్టి రుణం పొందడం. సాధారణంగా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్ సీలు) వీటిని అందజేస్తాయి.

Loans: మీకు వచ్చే అద్దె నుంచి రుణం పొందొచ్చు తెలుసా? డబుల్ ఆఫర్ ఇలా..
Property Loans

Updated on: Jul 14, 2024 | 6:15 PM

మన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి, అత్యవసరంగా ఎదురైన ఖర్చులను అధిగమించడానికి, చదువులు, వ్యాపారం తదితర వాటి కోసం లోన్లు తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా బ్యాంకులను సంప్రదించి రుణాలు తీసుకుంటాం. వాటిలో వ్యక్తిగత రుణాలు, జీతంపై రుణాలు, ఆస్తిపై రుణాలు ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. అలాగే మనకు వచ్చే అద్దె ఆదాయంపై కూడా బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. దానికి నిబంధనలు, అవసరమైన పత్రాలను తెలుసుకుందాం.

ప్రయోజనాలు ఇవే..

అద్దె ఆదాయంపై తీసుకునే రుణం యజమానులకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఇళ్లకు మరమ్మతులు చేసుకోవడం, వివిధ పెట్టుబడుల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగపడుతుంది. అద్దె ఆదాయంపై రుణం అంటే ఆస్తి నుంచి వస్తున్న అద్దెను తాకట్టు పెట్టి రుణం పొందడం. సాధారణంగా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్ సీలు) వీటిని అందజేస్తాయి. అద్దె ఆదాయంలో ఒక శాతం ఆధారంగా రుణ మొత్తం నిర్ణయిస్తాయి. కొన్ని బ్యాంకులు ఆ ఆస్తిని ప్రఖ్యాత కంపెనీలకు, సంస్థలకు అద్దెకు ఇచ్చారా అనే విషయాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుంటాయి. మీరు రుణం కోసం దరఖాస్తు చేస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థల నిబంధనలపై ఈ విషయాలు ఆధారపడి ఉంటాయి.

రుణం పొందడానికి అర్హతలు..

  • అద్దె ఆదాయం వచ్చే ఆస్తిని తప్పనిసరిగా కలిగి ఉండాలి. దానికి నుంచి కనీస అద్దె వస్తూ ఉండాలి. ఎందుకంటే రుణదాతలు స్థిరమైన అద్దె వచ్చే ఆస్తులను ఇష్టపడతారు.
  • మీ క్రెడిట్ స్కోర్, ఆర్థిక చరిత్ర బాగుండడం చాలా అవసం. రుణాల ఆమోదం, వడ్డీ రేటును నిర్ణయించడంలో అవి చాాలా కీలకంగా మారాయి.

అర్హతలు, అవసరమైన పత్రాలు..

  • ఆస్తి యాజమాన్యం, అద్దె ఆదాయ స్థిరత్వం, క్రెడిట్ యోగ్యత, ఆస్తి మదింపు ఆధారంగా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మీకు అర్హతలు ఉన్నాయో నిర్ధారించుకోండి.
  • ఆస్తి యాజమాన్య పత్రాలు, అద్దె ఒప్పందాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, ఆస్తి పత్రాలు తదితర వాటిని జాగ్రత్త చేసుకోవాలి.
  • అద్దె ఆదాయంపై రుణం కోసం మీకు ఇష్టమైన బ్యాంకును, రుణదాతను సంప్రదించవచ్చు. దరఖాస్తుతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాలి. మీ ఆస్తి మార్కెట్ విలువను, అద్దె సామర్థ్యాన్ని రుణదాతలు అంచనా వేస్తారు. మీరు సమర్పించిన పత్రాలను పరిశీలిస్తారు.
  • చాలా బ్యాంకులు వాణిజ్య ఆస్తులపై మాత్రమే రుణాలను మంజూరు చేస్తాయి. మరి కొందరు రుణదాతలు నివాస ఆస్తులకు కూడా రుణాలు అందిస్తారు. అలాగే మీరు ఏ కంపెనీకి లేదా సంస్థకు మీ ఆస్తిని అద్దెకు ఇచ్చారనే విషయాన్ని కూడా పరిశీలిస్తారు.
  • మీ ఆస్తి విలువ ఆధారంగా అన్ని విషయాలను పరిశీలించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలను మంజూరు చేస్తాయి. దీని కోసం కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత మీకు రుణాలు ఒకేసారి లేదా వాయిదాలలో అందజేస్తారు.

రుణగ్రహీతలకు చిట్కాలు..

  • అద్దె ఆదాయంపై రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆస్తి యజమానులు కొన్ని చిట్కాలు పాటించాలి. దానివల్ల మీకు తొందరగా రుణం మంజూరు కావడంతో పాటు హడావుడి పడకుండా పని సక్రమంగా జరుగుతుంది.
  • మీకు రుణాన్ని మంజూరు చేసేందుకు రుణదాతలకు చాలా సమాచారం కావాలి. అద్దె ఆదాయం, ఖర్చుల కచ్చితమైన రికార్డులను దగ్గర ఉంచుకోవాలి.
  • వివిధ బ్యాంకులు, ఎన్బీఎఫ్ సీ, హెచ్ఎఫ్ సీలు అందించే రుణాలపై వడ్డీరేట్లను తెలుసుకోండి.
  • వడ్డీ రేట్లు, చెల్లింపు కాలం, ముందస్తు చెల్లింపులపై జరిమానాలు, జప్తు తదితర నిబంధనలను పూర్తిగా చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..