Credit Card: క్రెడిట్ కార్డుపై చార్జీల మోత.. ఆగస్టు ఒకటి నుంచే కొత్త రూల్స్ అమలు..

|

Jul 31, 2024 | 3:24 PM

దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకులలో హెచ్ డీఎఫ్ సీ ఒకటి. ఆ బ్యాంకు ఖాతాదారులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. కొత్తగా మార్చిన క్రెడిట్ కార్డు నిబంధనలతో ఖాతాదారులకు షాక్ తగలనుంది. లావాదేవీలకు చార్జీలు వసూలు చేయడం వల్ల కొంత ఆర్థిక భారం పడుతుంది. గతంలో మాదిరిగా ఇష్ట వచ్చినట్టు కార్డు ఉపయోగించడానికి వీలుండదు.

Credit Card: క్రెడిట్ కార్డుపై చార్జీల మోత.. ఆగస్టు ఒకటి నుంచే కొత్త రూల్స్ అమలు..
Credit Card
Follow us on

క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక బ్యాంకు నుంచి వీటిని తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు కూాడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అత్యవసర సమయంలో నగదు అవసరాలు తీర్చడంతో పాటు వ్యాపార సంబంధ విషయాలలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు తన క్రెడిట్ కార్డుల నిబంధనలు మార్చింది. ఇకపై లావాదేవీలకు చార్జీలను వసూలు చేయనుంది. ఇది ఒక రకంగా క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్ అనే చెప్పాలి. కొత్త నిబంధనలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి.

లావాదేవీలకు చార్జీలు..

దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకులలో హెచ్ డీఎఫ్ సీ ఒకటి. ఆ బ్యాంకు ఖాతాదారులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. కొత్తగా మార్చిన క్రెడిట్ కార్డు నిబంధనలతో ఖాతాదారులకు షాక్ తగలనుంది. లావాదేవీలకు చార్జీలు వసూలు చేయడం వల్ల కొంత ఆర్థిక భారం పడుతుంది. గతంలో మాదిరిగా ఇష్ట వచ్చినట్టు కార్డు ఉపయోగించడానికి వీలుండదు. లావాదేవీలపై చార్జీల భారం పడనున్ననేపథ్యంలో కార్డు హోల్డర్లు అతి జాగ్రత్తగా వినియోగించుకోవాలి.

కొత్త నిబంధనలు ఇవే..

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు తీసుకువచ్చిన కొత్త నిబంధనలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలవుతాయి. వాటి ప్రకారం ఏ లావాదేవీలకు ఎంత చార్జి వసూలు చేస్తారో తెలుసుకుందాం.

  • పేటీఎం, క్రెడ్, మోబీక్విక్ , చెక్ తదితర థర్డ్ పార్టీ చెల్లింపు యాప్‌ల ద్వారా చేసిన లావాదేవీల మొత్తంపై ఒక శాతం చార్జి వసూలు చేస్తారు. ఆ లావాదేవీలను రూ.3 వేలకు పరిమితం చేశారు.
  • యుటిలిటీ లావాదేవీలకు సంబంధించి రూ.50 వేల కంటే తక్కువ వినియోగించేవారికి ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. ఆ పరిధి దాటితే ఒక శాతం చార్జి వసూలు చేస్తారు. వీటికి సంబంధించిన ఒక్కో లావాదేవీని రూ.3 వేలకు పరిమితం చేశారు.
  • బీమా సంబంధిత లావాదేవీలకు కొత్త చార్జీల నుంచి మినహాయింపు కల్పించారు. దీనివల్ల ఖాతాదారులకు కొంత ప్రయోజనం కలుగుతుంది. బీమా చెల్లింపులను నిర్వహించే కస్టమర్లకు ఉపయోగంగా ఉంటాయి.
  • ఇంధన లావాదేవీలకు సంబంధించి రూ.15 వేల వరకూ పరిమితి ఉంది. అది దాటితే ఒక శాతం చార్జి వసూలు చేస్తారు. ఒక్కో లావాదేవీకి రూ.3 వేల పరిమితి విధించారు. అంటే పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేసేవారికి తప్ప మిగిలిన వారికి చార్జీలు ఉండవు.
  • క్రెడ్, పేటీఎం తదితర థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లించే ఎడ్యుకేషనల్ పేమెంట్లకు కూడా ఒక శాతం చార్జీ చెల్లించాలి. ఒక్కో లావాదేవీకి రూ.3 వేల వరకూ మాత్రమే పరిమితి ఉంది. కానీ విద్యా సంస్థల వెబ్‌సైట్‌లు, పీవోఎస్ మెషీన్ల ద్వారా నేరుగా చేసే చెల్లింపులకు ఈ రుసుము ఉండదు. అలాగే అంతర్జాతీయ విద్యా చెల్లింపులను కూడా కొత్త చార్జీల నుంచి తప్పించారు.
  • అంతర్జాతీయ కరెన్సీ లావాదేవీలపై 3.5 శాతం మార్కప్ రుసుము విధించారు. విదేశాలలో తరచుగా కొనుగోళ్లు, చెల్లింపులు చేసే కస్టమర్ల నుంచి వసూలు చేస్తారు.
  • స్టేట్‌మెంట్ క్రెడిట్, క్యాష్‌బ్యాక్ కోసం రివార్డ్ పాయింట్లను రీడెంప్ చేయడానికి రూ.50 ఖర్చు అవుతుంది.
  • ఈజీ ఈఎంఐ సదుపాయాన్ని ఎంచుకునే కస్టమర్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లో ఈ ఎంపికను పొందడం కోసం రూ.299 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
  • టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డుదారుల కోసం రివార్డ్ స్ట్రక్చర్‌ను అప్ డేట్ చేశారు. దాని ప్రకారం టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు టాటా న్యూ ఇన్ఫినిటీ యూపీఐ ఐడీని ఉపయోగించి చేసిన అర్హత గల లావాదేవీలపై 1.5 శాతం న్యూ కాయిన్స్ పొందుతారు. ఇతర యూపీఐ ఐడీ లావాదేవీలకు 0.50 శాతం లభిస్తాయి. అలాగే టాటా న్యూ ప్లస్ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అర్హత కలిగిన యూపీఐ లావాదేవీలపై ఒకశాతం న్యూ కాయిన్స్, ఇతర యూపీఐ ఐడీలను ఉపయోగించి చేేసిన లావాదేవీలకు 0.25 శాతం న్యూ కాయిన్స్ లభిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..