SBI FD Interest Rates: ఎస్‌బీఐలో ఎఫ్‌డీ చేస్తే లాభమా? నష్టమా? ఆ బ్యాంకులో వడ్డీ రేటు, ఇతర ప్రయోజనాలు ఏంటంటే..

|

Sep 12, 2024 | 5:24 PM

పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు పోటాపోటీగా వడ్డీ రేట్లు, ఇతర ప్రయోజనాలను ఇస్తూ పెట్టుబడిదారులకు ఆకర్షించే స్కీమ్ లను పరిచయం చేస్తున్నాయి. ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అనేక రకాల ఎఫ్ డీ స్కీమ్ లను వినియోగదారులకు అందిస్తోంది. వీటిల్లో అధిక వడ్డీతో పాటు మంచి ప్రయోజనాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ అందిస్తున్న ఎఫ్డీ స్కీమ్ లు వాటిలో వడ్డీ వివరాలు తెలుసుకుందాం..

SBI FD Interest Rates: ఎస్‌బీఐలో ఎఫ్‌డీ చేస్తే లాభమా? నష్టమా? ఆ బ్యాంకులో వడ్డీ రేటు, ఇతర ప్రయోజనాలు ఏంటంటే..
Sbi
Follow us on

మన దేశంలో ఫిక్స్‪డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై ప్రజలకు అపారమైన నమ్మకం ఏర్పడింది. వాటికి ప్రభుత్వ భరోసా ఉంటుందని, మంచి వడ్డీ రేటు ఇస్తారని, కచ్చితమైన రాబడి వస్తుందని అంచనా వేసుకొని పెట్టుబడులు పెడుతుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్ కు వీటిల్లో అధిక ప్రయోజనాలుండటంతో పదవీవిరమణ చేసిన వారు పెద్ద ఎత్తున ఎఫ్‌డీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు పోటాపోటీగా వడ్డీ రేట్లు, ఇతర ప్రయోజనాలను ఇస్తూ పెట్టుబడిదారులకు ఆకర్షించే స్కీమ్ లను పరిచయం చేస్తున్నాయి. ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అనేక రకాల ఎఫ్ డీ స్కీమ్ లను వినియోగదారులకు అందిస్తోంది. వీటిల్లో అధిక వడ్డీతో పాటు మంచి ప్రయోజనాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ అందిస్తున్న ఎఫ్డీ స్కీమ్ లు వాటిలో వడ్డీ వివరాలు తెలుసుకుందాం..

ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా ఎఫ్‌డీ అనేది ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట కాలవ్యవధికి బ్యాంకులో ఏకమొత్తాన్ని డిపాజిట్ చేసే ఒక రకమైన పెట్టుబడి పథకం. ఖాతా ప్రారంభించినప్పుడే వడ్డీ రేటును నిర్ణయిస్తారు అయితే ఈ వడ్డీ రేటు సాధారణ పౌరులకు ఒకలాగ ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లను అందిస్తాయి. కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సాధారణ కష్టమర్లకు అందించే వడ్డీ రేట్ల జాబితాతో పాటు సీనియర్ సిటిజన్లు పొందగల రాబడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణ పౌరులకు ఎస్బీఐ ఎఫ్‌డీ రేట్లు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే సాధారణ పౌరులు 444 రోజుల కాలవ్యవధికి 7.25 శాతం రాబడిని పొందుతారు. అదే సమయంలో ఒక ఏడాదికే మెచ్యూరిటీ వ్యవధి ఉంటే ఆ వడ్డీ రేటు 6.8శాతం మాత్రమే ఉంటుంది. ఎస్బీఐ మూడేళ్ల కాలపరిమితితో ఉండే ఎఫ్డీకి 6.75శాతం వడ్డ రేటు అందిస్తోంది. అదే సమయంలో ఐదేళ్ల వ్యవధితో ఉండే ఎఫ్డీకి 6.5శాతం వడ్డీ రేటు బ్యాంకు ఇస్తోంది.

సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ ఎఫ్‌డీ రేట్లు..

  • సీనియర్ సిటిజన్లు 444 రోజుల కాలానికి 7.75 శాతం వడ్డీ రేటును పొందవచ్చు.
  • 1 సంవత్సరం కాలానికి, సీనియర్ సిటిజన్లు 7.3 శాతం వడ్డీ రేటుతో ప్రయోజనం పొందవచ్చు.
  • 3 సంవత్సరాల కాల వ్యవధికి బ్యాంక్ 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • 5 సంవత్సరాల కాల వ్యవధికి 7.5 శాతం వడ్డీ రేటును బ్యాంకు అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..