TVS iQube ST: అదిరిపోయే లుక్‌తో కొత్త ఈవీ స్కూటర్‌.. మార్కెట్‌లో అమ్మకాల పూనకాలే..!

ప్రస్తుతం రోడ్లపై ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు సర్రున దూసుకుపోతున్నాయి. పట్టణ వాసులతో పాటు గ్రామీణులు కూడా వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్‌ విభాగంతో పలు మోడళ్లను రూపొందించి మార్కెట్‌ లోకి విడుదల చేస్తున్నాయి. అలాంటి కంపెనీలలో టీవీఎస్‌ ఒకటి. దీని నుంచి విడుదలయ్యే వాహనాల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారనడం అతిశయోక్తి కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలనూ టీవీఎస్‌ విడుదల చేస్తోంది. వాటిలో ఐక్యూబ్‌ ఒకటి. దీనికి కొనుగోలు దారుల ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ నుంచి ఐక్యూబ్‌ ఎస్టీ అనే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదలైంది. దీని ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

TVS iQube ST: అదిరిపోయే లుక్‌తో కొత్త ఈవీ స్కూటర్‌.. మార్కెట్‌లో అమ్మకాల పూనకాలే..!
Iqube St

Updated on: May 13, 2025 | 3:00 PM

టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎస్‌టీ డిజైన్‌ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ముందు భాగంలో ఐక్యూబ్‌ బ్యాడ్జ్‌ కింద ఎస్‌టీ అనే డెకెల్స్‌ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ముందు భాగంలో డీఆర్‌ఎల్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంపులు, టర్న్‌ ఇండికేటర్లు బాగున్నాయి. వెనుక భాగంలో టెయిల్‌ ల్యాంపుతో పాటు ఇండికేటర్‌, క్యూ పార్క్‌ అసిస్ట్‌ బ్యాడ్జీ ఆకట్టుకుంటున్నాయి. స్కూటర్‌ ఆన్‌ చేసినప్పుడు, చార్జ్‌ కోసం ప్లగ్‌ చేసినప్పుడు పవర్‌ యూనిట్‌ లోని టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ బ్యాడ్జీ నీలం రంగులోకి మారిపోతుంది. కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ఏడు అంగుళాల డిస్‌ ప్లే ఏర్పాటు చేశారు. జియోఫె‍న్సింగ్‌, రైడ్‌ డేటా విశ్లేషణ, టర్న్‌బైటర్న్‌ నావిగేషన్‌ తదితర స్మార్ట్‌ ఫీచర్లు అందించడానికి ఫోన్‌తో కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఎడమవైపు హ్యాండిల్‌పై ఉన్న జాయ్‌ స్టిక్‌తో చాలా సులువుగా నియం‍త్రణ చేసుకోవచ్చు. దీనితో పాటు ఎడమవైపున హాజార్డ్‌ లైట్‌, పార్కింగ్‌ మోడ్‌, మోడ్‌ స్వీచ్‌ కూడా ఏర్పాటు చేశారు.

కొత్త టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎస్‌టీ స్కూటర్‌ 3.4 కేడబ్ల్యూహెచ్‌, 5.1 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. సింగిల్‌ చార్జ్‌తో సుమారు 110 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయవచ్చు. కేవలం నాలుగు గంటల సమయంలో బ్యాటరీని సున్నా నుంచి 80 శాతం వరకూ చార్జింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. నగరంలో ప్రయాణానికి అనువుగా ఈ స్కూటర్‌ను తయారు చేశారు.

టీవీఎస్‌ విడుదల చేసిన ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇప్పటికే మార్కెట్‌లో విక్రయాల పరంగా దూసుకువెళుతోంది. దీన్ని పూర్తిగా చార్జింగ్‌ చేస్తే సుమారు 75 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. దాని కొనసాగింపులో భాగంగా ఐక్యూబ్‌ ఎస్‌టీని తీసుకువచ్చారు. కొత్త స్కూటర్‌లో 32 లీటర్ల బూట్‌ స్పేస్‌ అదనపు ప్రత్యేకత. ముఖ్యంగా మెరుగైన డిజైన్‌, అధునాతన ఫీచర్లు, మంచి పనితీరుతో టీవీఎస్‌ కొత్త స్కూటర్‌ ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి