
ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ కొమాకి తన కొత్త ఎక్స్ఆర్ఐ సిరీస్ మోపెడ్ ను విడుదల చేసింది. అనేక ప్రత్యేకతలు, ఆకట్టుకునే స్లైల్ తో దీన్ని రూపొందించింది. ముఖ్యంగా నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా, పురుషులతో పాటు మహిళలు కూడా చాలా సులభంగా డ్రైవింగ్ చేసేలా తయారు చేశారు. రోజు వారీ పనులతో పాటు ఆఫీసుకు వెళ్లడానికి, సరదాగా తిరగడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. కొమాకి మోపెడ్ ధర తక్కువైనప్పుటికీ అనేక ప్రత్యేకతలు, ఫీచర్లతో తయారు చేశారు. ముఖ్యంగా రేంజ్ (మైలేజీ) విషయంలో సూపర్ అని చెప్పవచ్చు. ఒక్కసారి పూర్తిస్థాయిలో చార్జి చేస్తే సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. షాక్ అబ్సార్బింగ్ సస్పెన్షన్, హై గ్రిప్ టైర్లతో ఎలాంటి రోడ్లపై నైనా మోపెడ్ పరుగులు తీస్తుంది. దీనిలో రెండు సీట్లు ఉండడంలో ఇద్దరు చాలా సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు. ముందు భాగంలో బాస్కెట్ ఏర్పాటు చేశారు. కూరగాయలు, సరకులు తెచ్చుకోవడానికి బాగుంటుంది.
నగరంలోని ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన వీధుల్లో కొమాకి మోపెడ్ ను చాలా సులభంగా డ్రైవింగ్ చేయవచ్చు. దేశంతో అత్యంత తక్కువ ధరకే లభిస్తున్న తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ మోపెడ్ ఇదే. మన దేశంలో రూ.29,999 (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. దీనిలో ప్రత్యేకమైన రీజనరేటివ్ పవర్ సిస్టమ్ ఉంది. అంటే బ్యాటరీలో చార్జింగ్ అయిపోయిన తర్వాత కూడా ప్రయాణం చేయవచ్చు. కొమాకితో పాటు వివిధ బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ మోపెడ్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అనేక కంపెనీలు ఈ విభాగంలో తమ ఉత్పత్తులను విడుదల చేశాయి.
ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ రూ.32,999 (ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది. గంటలకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేయవచ్చు. ఒక్కసారి పూర్తి స్థాయిలో చార్జి చేస్తే సుమారు 70 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయవచ్చు.
ఉజాస్ ఈగో ఎల్ఏ ఎలక్ట్రిక్ మోపెడ్ రేంజ్ 60 నుంచి 75 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేయవచ్చు. దీని ధర రూ.34,880 (ఎక్స్ షోరూమ్).
బ్యాటరీ ఎంపికను బట్టి ఈ మెపెడ్ రేంజ్ 60 నుంచి 100 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ధర రూ.41,999 (ఎక్స్ ఫోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. వేగం గంటకు 25 కిలోమీటర్లు.
హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఎల్ఎక్స్ మోపెడ్ రూ.59,640 (ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది. సింగిల్ చార్జితో 85 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయవచ్చు. గంటకు గరిష్ట వేగం 25 కిలోమీటర్లు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..