Cars: సన్‌రూఫ్‌తో పాటు సీఎన్‌జీ కారు కోసం చూస్తున్నారా.? ఇవే బెస్ట్‌ ఆప్షన్స్‌

|

Apr 15, 2024 | 2:01 PM

భారీగా పెరిగిన పెట్రోల్‌ ధరలను బయటపడేందుకు ప్రజలు సీఎన్‌జీ వైపు మొగ్గుచూపుతున్నారు. తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు ఉండడంతో చాలా మంది సీఎన్‌జీ కార్లను ఉపయోగిస్తున్నారు. అయితే సీఎన్‌జీ కార్లను అధునాతన ఫీచర్లు ఉండవని చాలా మంది అనుకుంటుంటారు. ముఖ్యంగా సన్‌రూఫ్‌ వంటి ఫీచర్‌ కోసం...

Cars: సన్‌రూఫ్‌తో పాటు సీఎన్‌జీ కారు కోసం చూస్తున్నారా.? ఇవే బెస్ట్‌ ఆప్షన్స్‌
Hyundai Exter Cng
Follow us on

భారీగా పెరిగిన పెట్రోల్‌ ధరలను బయటపడేందుకు ప్రజలు సీఎన్‌జీ వైపు మొగ్గుచూపుతున్నారు. తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు ఉండడంతో చాలా మంది సీఎన్‌జీ కార్లను ఉపయోగిస్తున్నారు. అయితే సీఎన్‌జీ కార్లను అధునాతన ఫీచర్లు ఉండవని చాలా మంది అనుకుంటుంటారు. ముఖ్యంగా సన్‌రూఫ్‌ వంటి ఫీచర్‌ కోసం పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్‌ను చూస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో సీఎన్‌జీ వేరియంట్‌తో పాటు సన్‌రూఫ్‌తో కూడిన కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏంటి.? వాటిలో ఉన్న ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG

తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో మార్కెట్లో సందడి చేస్తుందీ కొత్త కారు. హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ SX CNG వేరియంట్ సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఈ వేరియంట్ ధర రూ. 9.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది CNG లైనప్‌లో టాప్ వేరియంట్. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా పంచ్ CNG..

ఈ కారులో కూడా సన్‌రూఫ్‌ ఫీచర్‌ను అందించారు. ఈ కారు ధర రూ. 7.23 లక్షల నుంచి రూ. 9.85 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇక ఈ కారులో 7 ఇంచెస్‌తో కూడిన టచ్‌స్క్రీన్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ AC, EBDతో కూడిన ABS, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్ CNG..

టాటా ఆల్ట్రోజ్‌ సీఎన్‌జీ వెర్షన్‌ను మే 2023లో ప్రారంభించింది. ఇది సింగిల్ పేన్ సన్‌రూఫ్‌తో వస్తుంది. టాటా ఆల్ట్రోజ్ CNG ధర రూ. 7.6 లక్షల నుంచి రూ. 10.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇందులో 7 ఇంచెస్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతీ బ్రెజ్జా CNG..

మారుతి బ్రెజ్జా CNGలో కూడా సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. దీని రెండవ టాప్ ZXi CNG వేరియంట్ సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో వస్తుంది. దీని ధర రూ. 12.10 లక్షలుగా ఉంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. SUV ఆటోమేటిక్ AC, 6-స్పీకర్ ARKAMYS సౌండ్ సిస్టమ్‌ను అందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..