Senior Citizens FD: ఎఫ్‌డీలపై ఏకంగా 8.25శాతం వరకూ వడ్డీ.. సీనియర్ సిటిజెన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు..

సీనియర్ సిటీజన్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇస్తున్న వడ్డీ రేట్లను జాగ్రత్తగా పరిశీలించాలి. మీకు పెట్టుబడికి రక్షణ, మంచి ఆదాయాన్ని ఇచ్చే బ్యాంకును ఎన్నుకోవాలి. వడ్డీపై పన్ను విధానాలను కూడా పరిశీలించాలి. సీనియర్ సిటిజన్ల ఎఫ్ డీలపై వచ్చే అధిక ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఆ షరతులు, నిబంధనలు తెలుసుకోవాలి.

Senior Citizens FD: ఎఫ్‌డీలపై ఏకంగా 8.25శాతం వరకూ వడ్డీ.. సీనియర్ సిటిజెన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు..
Fd Rate
Follow us

|

Updated on: Mar 22, 2024 | 7:26 AM

బ్యాంకుల్లో మనం సాధారణంగా ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తాం. నిర్ణీత కాల పరిమితికి చేసే ఈ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీని అందిస్తాయి. అలాగే మన డబ్బు సురక్షితంగా ఉంటుంది. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లోనూ వివిధ ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డీ) పథకాలు ఉన్నాయి. అవి అందించే వడ్డీ రేట్లలోనూ తేడాలుంటాయి. సాధారణ ఎఫ్ డీల కన్నా సీనియర్ సిటిజన్లు చేసే ఎఫ్ డీలు వడ్డీ ఎక్కువగా వస్తుంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి, ఉద్యోగ విరమణ చేసిన వారికి, విరమణకు దగ్గరగా ఉన్న వారికి ఇవి ఆకర్షణీయమైన పెట్టుబడి పథకాలుగా చెప్పవచ్చు. సీనియర్ సిటిజన్ ఎఫ్ డీలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తాయి. అయితే వివిధ బ్యాంకుల్లో ఎఫ్ డీలు చేసేముందు కొన్ని అంశాలను గమనించాలి. వాటి లాభనష్టాలను అంచనా వేయాలి.

అధిక వడ్డీ రేట్లు..

సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను కోరుకుంటారు. వారి ఉద్యోగ విరమణ నిధులకు అనుబంధంగా వీటిని అదనపు ఆదాయ వనరులుగా భావిస్తారు. అలాగే ఇవి సురక్షిత పెట్టుబడి మార్గాలు. పెట్టుబడికి పూర్తి రక్షణ లభిస్తుంది. స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక స్థిరత్వం కలుగజేస్తాయి.

పరిశీలించాల్సిన అంశాలు ఇవే..

  • సీనియర్ సిటీజన్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇస్తున్న వడ్డీ రేట్లను జాగ్రత్తగా పరిశీలించాలి. మీకు పెట్టుబడికి రక్షణ, మంచి ఆదాయాన్ని ఇచ్చే బ్యాంకును ఎన్నుకోవాలి.
  • వడ్డీపై పన్ను విధానాలను కూడా పరిశీలించాలి. సీనియర్ సిటిజన్ల ఎఫ్ డీలపై వచ్చే అధిక ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఆ షరతులు, నిబంధనలు తెలుసుకోవాలి.
  • సుధీర్ఘ కాల పరిమితితో ఎఫ్ డీలు చేస్తే దానిపై వడ్డీ రేటు కూడా అధికంగానే ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో వాటిని తీసుకునే అవకాశం ఎంత వరకూ ఉంటుందో గమనించాలి.
  • ఎఫ్ డీల అకాల ఉపసంహరణకు సంబంధించిన పెనాల్టీలు, ఛార్జీల గురించి తెలుసుకోండి. వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండడం చాాలా అవసరం, వడ్డీ రేట్లు, పన్ను చిక్కులు, లిక్విడిటీ అవసరాలు, పునరుద్ధరణ తదితర విషయాలను జాగ్రత్తగా గమనించాలి.

వివిధ బ్యాంకుల అందిస్తున్న వడ్డీరేట్లు..

సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. వీటిని గమనిస్తే వడ్డీ రేట్లపై అవగాహన కలుగుతుంది. హెచ్ డీఎఫ్ సీ 7.75, యాక్సిస్ బ్యాంకు 7.85, బ్యాంకు ఆఫ్ బరోడా 7.75, బ్యాంకు ఆఫ్ ఇండియా 7.75, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర 7.5, కెనరా బ్యాంకు 7.75, సెంట్రల్ బ్యాంకు 7.75, ఇండియన్ బ్యాంకు 7.75, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు 7.8, పంజాబ్ నేషనల్ బ్యాంకు 7.75, స్టేట్ బ్యాంకు 7.6, యూనియన్ బ్యాంకు 7.75, ఐసీఐసీఐ బ్యాంకు 7.75, కోటక్ మహీంద్ర బ్యాంకు 7.9, యస్ బ్యాంకు 8.25 శాతం వడ్డీ అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..