Banking: భారీ మొత్తంలో బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తున్నారా? ఈ రూల్ గురించి తెలుసుకోండి..

డిపాజిట్లు, విత్ డ్రాల విషయంలో కొన్ని నిబంధనలున్నాయని చాలా మందికి తెలీదు. ఆదాయ పన్ను శాఖ పెద్ద మొత్తంలో డిపాజిట్లు, విత్ డ్రాలు చేసే వారిపై నిఘా ఉంచుతుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే ఆ నిబంధనల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆదాయ పన్ను శాఖ నిబంధన ప్రకారం నగదు డిపాజిట్లపై పరిమతి ఉంది. అంటే ఒక నిర్ధిష్ట మొత్తంలో మాత్రమే మనం నగదు జమ చేసుకోవాల్సి ఉంటుంది.

Banking: భారీ మొత్తంలో బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తున్నారా? ఈ రూల్ గురించి తెలుసుకోండి..
Bank Deposit

Updated on: Jun 05, 2024 | 5:22 PM

మన దేశంలో దాదాపు ప్రతి పౌరుడికి బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉంది. జీరో బ్యాలెన్స్ ఖాతాల కారణంగా అందరూ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారు. ఉద్యోగులకు శాలరీ అకౌంట్లు ఉంటాయి. వ్యాపారులు పెద్ద మొత్తంలో సేవింగ్స్ ఖాతాలో డబ్బులు జమ చేస్తుంటారు. దానిని యూపీఐకి లింక్ చేసుకొని మనం లావాదేవీలు సులభంగా నిర్వహిస్తుంటాం. ఆ ఖాతాలో డబ్బులు వేస్తూ.. తీస్తూ ఉంటాం. అయితే ఈ డిపాజిట్లు, విత్ డ్రాల విషయంలో కొన్ని నిబంధనలున్నాయని చాలా మందికి తెలీదు. ఆదాయ పన్ను శాఖ పెద్ద మొత్తంలో డిపాజిట్లు, విత్ డ్రాలు చేసే వారిపై నిఘా ఉంచుతుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే ఆ నిబంధనల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆదాయ పన్ను శాఖ నిబంధన ప్రకారం నగదు డిపాజిట్లపై పరిమతి ఉంది. అంటే ఒక నిర్ధిష్ట మొత్తంలో మాత్రమే మనం నగదు జమ చేసుకోవాల్సి ఉంటుంది. మనీలాండరింగ్, పన్ను ఎగవేత వంటి అక్రమ ఆర్థిక కార్యకలాపాలను నిరోధించేందుకు ఆదాయ పన్ను శాఖ ఇటువంటి నిబంధనను విధించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎంత మొత్తం డిపాజిట్ చేయొచ్చు..

నిబంధన ప్రకారం మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, మీరు ఐటీ విభాగానికి తెలియజేయాలి. ఒకవేళ మీకు కరెంట్ ఖాతా ఉంటే, పరిమితి రూ. 50 లక్షలు వరకూ ఉంటుంది. ఈ నగదుకు వెంటనే పన్ను విధించబడదు, అయితే ఆర్థిక సంస్థలు ఈ పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి. గత మూడేళ్లుగా పన్ను రిటర్న్‌లు దాఖలు చేయని వారు 2% టీడీఎస్ చెల్లించాలి. అది కూడా రూ. 20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే మాత్రమే ఇది చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యక్తులు నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి విత్‌డ్రా చేస్తే, 5% టీడీఎస్ విధిస్తారు.

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్ కింద మినహాయింపు పొందిన టీడీఎస్ ఆదాయంగా వర్గీకరించరు. అయితే ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసేటప్పుడు క్రెడిట్‌గా ఉపయోగించవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్టీ ప్రకారం, ఒక వ్యక్తి నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, జరిమానా విధిస్తారు. బ్యాంకు నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఈ పెనాల్టీ వర్తించదు. నిర్దిష్ట పరిమితికి మించిన ఉపసంహరణలకు టీడీఎస్ తగ్గింపు వర్తిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..