PM Awas Yojana: సొంతింటి కల ఆ పథకంతో సాకారం.. ప్రయోజనాలతో పాటు అర్హత ఏంటంటే..?

|

Jun 15, 2024 | 4:51 PM

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మూడోసారి భారత ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. కొత్త మంత్రివర్గ మొదటి సమావేశం ఇటీవల పీఎం మోడీ నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల అదనపు ఇళ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం 2015లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు నిర్మించడం ఈ పథకం లక్ష్యం.

PM Awas Yojana: సొంతింటి కల ఆ పథకంతో సాకారం.. ప్రయోజనాలతో పాటు అర్హత ఏంటంటే..?
Home Loan2
Follow us on

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మూడోసారి భారత ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. కొత్త మంత్రివర్గ మొదటి సమావేశం ఇటీవల పీఎం మోడీ నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల అదనపు ఇళ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం 2015లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు నిర్మించడం ఈ పథకం లక్ష్యం. పీఎంఏవై కింద గత 10 సంవత్సరాలలో అర్హులైన పేద కుటుంబాలకు మొత్తం 4.21 కోట్ల ఇళ్లు నిర్మించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల మరికొంత మంది సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. అయితే ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం దరఖాస్తు విధానం, అర్హతతో పాటు ఇతర ప్రయోజనాలను ఓ సారి తెలుసుకుందాం.

మీరు ఇప్పటికే శాశ్వత ఇంటిని నిర్మించకుంటే, దానికి సంబంధించిన అర్హత అవసరాలన్నీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నా మీరు పీఎంఏవై కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు మీరు ప్రధాన్ మంత్రి యోజన పథకానికి సంబంధించిన అర్హత అవసరాలు, ప్రయోజనాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. పీఎంఏవైలో రెండు రకాలు ఉన్నాయి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్. ఈ పథకం తాత్కాలిక గృహాల్లో నివసించే వారికి పక్కా గృహాలను పొందేందుకు సహాయపడుతుంది. అలాగే భూమి ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వం గృహ రుణాలపై రాయితీలను అందిస్తుంది. సబ్సిడీ మొత్తం ఇంటి పరిమాణం, ఆదాయ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఈ పథకం కింద బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను కూడా అందిస్తాయి. పీఎంఏవై పథకం కింద గృహ రుణాలకు గరిష్టంగా తిరిగి చెల్లించే వ్యవధి 20 సంవత్సరాలుగా ఉంది. 

పీఎంఏవై అర్హత

పథకం ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తుదారు వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి. 18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అందుబాటులో ఉంది. ఇది వార్షిక ఆదాయాన్ని బట్టి కూడా మారుతుంది. అలాగే దరఖాస్తుదారుడికి ఎలాంటి పక్కా ఇల్లు కలిగి ఉండకూడదు. కుటుంబంలో ఏ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. 

ఇవి కూడా చదవండి

దరఖాస్తు ఇలా

  • మీరు పీఎం ఆవాస్ యోజన కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ కోసం మీరు పీఎంఏవై అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
  • హోమ్‌పేజీలో పీఎం ఆవాస్ యోజనపై క్లిక్ చేయాలి.
  • మీ మొత్తం సమాచారంతో నమోదు చేసుకోవాలి.
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, దరఖాస్తును సమర్పించాలి.
  • అలాగే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, మీరు సమీపంలోని సాధారణ సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి