Indian Railways: రైళ్లల్లో రద్దీకి ఇక చెక్.. త్వరలోనే అందుబాటులోకి పది వేల నాన్ ఏసీ కోచ్‌లు..

|

Jul 31, 2024 | 3:27 PM

భారతదేశంలో దూరప్రాంతాలకు ప్రయాణించాలంటే అందరికీ టక్కున గుర్తు వచ్చేది రైలు. రైలు ప్రయాణం అనేది భారతదేశంలో చౌకైన ప్రయాణ సాధనంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో రైలు ప్రయాణం అంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత కేంద్ర ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో ఈ ఇబ్బంది మరింత ఎక్కువైంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రెండు నుంచి మూడు జనరల్ బోగీలు ఉండడంతో అత్యవసర ప్రయాణాలకు కష్టంగా ఉంటుంది. అలాగే రిజర్వేషన్ చేయించుకుందామంటే వెయిటింగ్ లిస్ట్ మరింత భయపెడుతుంది.

Indian Railways: రైళ్లల్లో రద్దీకి ఇక చెక్.. త్వరలోనే అందుబాటులోకి పది వేల నాన్ ఏసీ కోచ్‌లు..
Indian Railways
Follow us on

భారతదేశంలో దూరప్రాంతాలకు ప్రయాణించాలంటే అందరికీ టక్కున గుర్తు వచ్చేది రైలు. రైలు ప్రయాణం అనేది భారతదేశంలో చౌకైన ప్రయాణ సాధనంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో రైలు ప్రయాణం అంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత కేంద్ర ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో ఈ ఇబ్బంది మరింత ఎక్కువైంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రెండు నుంచి మూడు జనరల్ బోగీలు ఉండడంతో అత్యవసర ప్రయాణాలకు కష్టంగా ఉంటుంది. అలాగే రిజర్వేషన్ చేయించుకుందామంటే వెయిటింగ్ లిస్ట్ మరింత భయపెడుతుంది. ఈ నేపథ్యంలో రైళ్లలో రద్దీపై ఫిర్యాదులు ఇటీవల పెరుగుతున్నందున ప్రస్తుతం 22 కోచ్‌లు ఉన్న రైళ్లలో 12 నాన్-ఏసీ జనరల్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు, ఎనిమిది ఏసీ కోచ్‌లు ఉన్నాయని ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం వినియోగిస్తున్న అన్ని కోచ్‌లలో మూడింట రెండు వంతులు నాన్-ఏసీ, మూడింట ఒక వంతు ఏసీ వేరియంట్‌లని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి తాజా ప్రకటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

రాజ్యసభలో ఐయూఎంఎల్‌ ఎంపీ హరీస్‌ బీరాన్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తక్కువ ధర ప్యాసింజర్ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉందని ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని అలాంటి రైళ్ల సంఖ్యను తగ్గించారా అని బీరన్ ప్రశ్నించారు. కరోనా కారణంగా 2020 నుంచి 2024 వరకు ప్రయాణీకుల రద్దీ బాగా పెరిగిందదని రైల్వే మంత్రి వైష్ణవ్ తెలిపారు. అయితే భారతీయ రైల్వేలు వివిధ రకాల రెగ్యులర్ టైమ్-టేబుల్ రైళ్లను నిర్వహిస్తుంది. సబర్బన్, తక్కువ దూర ప్రయాణికుల రైళ్లు, సుదూర/మెయిల్ ఎక్స్‌ప్రెస్/ సూపర్‌ఫాస్ట్ రైళ్లు వివిధ వర్గాల ప్రయాణీకులకు అనుగుణంగా ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని హైలైట్ చేస్తూ 22 కోచ్‌లు కలిగిన మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల కూర్పును 12 జనరల్ క్లాస్ & స్లీపర్ క్లాస్ నాన్-ఏసీ కోచ్‌లు, 08 (ఎనిమిది) ఏసీ-కోచ్‌లు ఉంటాయని వివరిస్తున్నారు. ఇది జనరల్, నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లను ఉపయోగించి ప్రయాణికులకు ఎక్కువ వసతిని కలిగి ఉంటుంది. 

అమృత్ భారత్ సేవలు

భారతీయ రైల్వే ఇటీవల అమృత్ భారత్ సేవలను ప్రవేశపెట్టిందని అవి పూర్తిగా నాన్-ఎసి రైళ్లు, ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పండుగల రద్దీ సమయంలో ప్రత్యేక రైలు సేవలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సెలవులు, ఇతర పీక్ సమయాల్లో పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన రైళ్ల భారాన్ని కూడా పెంచుతాయని వివరించారు. ప్రస్తుతం పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని జనరల్ క్లాస్, స్లీపర్ క్లాస్ కోచ్‌లతో సహా 10,000 నాన్-ఏసీ కోచ్‌లను తయారు చేయాలని ఐఆర్ ప్లాన్ చేసిందని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..