TATA Play binge: ప్రస్తుతం ఓటీటీల (OTT) హవా నడుస్తోంది. దాదాపు అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సొంతంగా ఓటీటీ యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. సినిమాలు, సీరియళ్లను యాప్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇక బడా సంస్థలు సైతం ఈ రంగంలోకి దిగడంతో ఓటీటీ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కంటెంట్ వస్తోంది. అయితే ఎన్నో రకాల ఓటీటీలు అందుబాటులో ఉన్న తరుణంలో ఒక్కో ఓటీటీకి ఒక్కో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ఆర్థికంగా భారమనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. ఇలాంటి వారి కోసమే ప్రముఖ డీటీహెచ్ కంపెనీ టాటా ప్లే.. తాజాగా టాటా ప్లే బింజ్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీని ద్వారా కేవలం ఒకే ఒక సబ్‌స్క్రిప్షన్‌తో ఏకంగా 17 ఓటీటీలను వీక్షించొచ్చు. డీటీహెచ్‌తో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, వూట్ సెలెక్ట్, ఎంఎక్స్ ప్లేయర్, సన్ నెక్ట్స్, హంగామా ప్లే, ఎరోస్ నౌ, వూట్ కిడ్స్, ప్లానెట్ మరాఠీతో పాటు మరికొన్ని ఓటీటీ సేవలను ఉచితంగా పొందే అవాకశం కల్పించారు. ఇదిలా ఎంపిక చేసుకున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య ఆధారంగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మారుతుంది.
ప్రారంభ ప్యాక్ ధర రూ. 59తో ప్రారంభంకానుంది. రూ. 99, రూ. 175, రూ. 299 ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ఆధారంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకోవచ్చు. టాటా ప్లే బింజ్+, అమెజాన్ ఫైర్ స్టిక్ ద్వారా టీవీల్లోనూ ఈ ఓటీటీలను వీక్షించొచ్చని కంపెనీ చెబుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..