Tata Motors: మార్కెట్‎లోకి టాటా మోటర్స్ రవాణా వాహనాలు.. ధరలు ఎలా ఉన్నాయంటే..

|

Oct 28, 2021 | 5:34 PM

ఆటో మొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ ఈరోజు 21 కొత్త వాహనాలను వివిధ వేరియంట్లలో విడుదల చేసింది. ఈ వాహనాలు సరుకులు తరలించడంతోపాటు ప్రజా రవాణా కూడా ఉపయోగపడనున్నాయి...

Tata Motors: మార్కెట్‎లోకి టాటా మోటర్స్ రవాణా వాహనాలు.. ధరలు ఎలా ఉన్నాయంటే..
Tata
Follow us on

ఆటో మొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ ఈరోజు 21 కొత్త వాహనాలను వివిధ వేరియంట్లలో విడుదల చేసింది. ఈ వాహనాలు సరుకులు తరలించడంతోపాటు ప్రజా రవాణా కూడా ఉపయోగపడనున్నాయి.”భారత ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేసే మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇ-కామర్స్ సరుకు రవాణా సజావుగా నడవడానికి నిరంతర మద్దతు అవసరమని టాటా మోటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ అన్నారు. వాణిజ్య వాహనాలలో అగ్రగామిగా మేము కొనసాగుతామమని తెలిపారు. స్మార్ట్, ఆధునికమైన ఉత్పత్తులు, సేవలను పరిచయం చేయడం ద్వారా వినియోగదారులకు ఉన్నతమైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈరోజు మేము పరిచయం చేస్తున్న 21 ఫీచర్ రిచ్ వాహనాలను భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న అవసరాలు, సమర్థవంతమైన రవాణా కోసం తయారు చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సౌకర్యాలలో అప్‌గ్రేడ్ చేసి వాహనాలు తీసుకొచ్చామని చెప్పారు. ఈ వాహనాలతో తక్కువ ఖర్చులతో ఎక్కువ లాభాలు పొందవచ్చని అన్నారు. వీటి ధరలో కోసం టాటా మోటర్స్ వైబ్‎సైట్‎లో చూడొచ్చని చెప్పారు.

ఈ మధ్యే టాటా మోటార్స్ టాటా పంచ్ ఎస్‎యూవీ కారును మార్కెట్‎లోకి వచ్చింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ గ్లోబల్ ఎన్‌క్యాప్ (NCAP) నుంచి పెద్దల భద్రత కోసం 5-స్టార్ రేటింగ్ (16.453), పిల్లల భద్రత కోసం 4-స్టార్ రేటింగ్ (40.891) పొందింది. కొత్త పంచ్ జనవరి 2020 లో ఆల్ట్రోజ్, డిసెంబర్ 2018 లో నెక్సాన్ తర్వాత 5-స్టార్ సెక్యూరిటీ రేటింగ్ పొందిన టాటా నుండి వచ్చిన మూడవ వాహనం. ఇప్పటివరకూ ఇలా వరుసగా టాప్ 5 స్టార్ రేటింగులతో వాహనాలను ప్రవేశపెడుతున్న ఏకైక కంపెనీ టాటా మోటార్స్ కావడం చెప్పుకోదగ్గ విషయం.

Read Also.. Sensex Crash: దీపావళికి ముందు మదుపరులకు బ్లాక్ డే.. లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు..