Cars: లుక్‌లోనే కాదు ఫీచర్స్‌లోనూ పోటా పోటీ.. ఆ రెండు కార్ల మధ్య ప్రధాన తేడాలివే..!

సొంత కారు అనేది ప్రతి మధ్య తరగతి కుటుంబానికి ఉండే కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు పొదుపు చేసుకున్న సొమ్ముతో పాటు కారు లోన్ తీసుకుని మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దేశంలో మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండడంతో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రెండు కార్ల కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. టాటా ఆల్ట్రోజ్‌తో పాటు మారుతి సుసుకీ బాలెనో కార్ల ప్రజల దృష్టికి ఆకర్షిస్తున్నాయి. ఈ నేపత్యంలో ఈ రెండు కార్ల మధ్య ఉన్న ప్రధాన తేడాలను తెలుసుకుందాం.

Cars: లుక్‌లోనే కాదు ఫీచర్స్‌లోనూ పోటా పోటీ.. ఆ రెండు కార్ల మధ్య ప్రధాన తేడాలివే..!
Tata Altroz Vs Maruti Suzuki Baleno

Updated on: May 25, 2025 | 5:45 PM

టాటా ఆల్ట్రోజ్ ఫేస్స్‌లిఫ్ట్, సుజుకి బాలెనో ఇటీవల ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు కార్లు స్టైల్, సౌకర్యం, ఇంధన సామర్థ్యం, తాజా ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. రోజువారీ ప్రయాణంతో పాటు ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనే ఈ కార్లు అనువుగా ఉండడంతో చాలా మందికి ఈ కార్ల కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. ఈనేపథ్యంలో ఈ రెండు కార్లు ఫీచర్లు, నిర్వహణ విషయాన్ని తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. టాటా ఆల్టోజ్ ఫేస్లిఫ్ట్ బహుముఖ శ్రేణి ఇంజిన్ ఎంపికలను అందిస్తుంది. ఈ హ్యాచ్బ్యాక్ మూడు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. 88 బీహెచ్పీ, 115 ఎన్ఎం టార్క్‌ను అందించే 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 118 బీహెచ్‌పీ, 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 89 బీహెచ్‌పీ, 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. అలాగే ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో కూడిన 1.2 లీటర్ సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ట్రాన్స్ మిషన్ ఎంపికలలో 5 స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ, 6 స్పీడ్ డీసీఏ ఉన్నాయి. మరోవైపు బాలెనో రెండు ఇంజన్ ఎంపికలను అందిస్తుంది. 88.5 బీహెచ్‌పీ, 113 ఎన్ఎం టార్క్‌ను అందించే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 76.4 బీహెచ్‌పీ, 113 ఎన్ఎం పీక్ టార్క్ ను అభివృద్ధి చేసే సీఎన్‌జీ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో ఆకట్టుకుంటుంది. 

ఫీచర్లు

టాటా ఆల్ట్రోజ్ ఫేస్లిఫ్ట్ కారులో 10 25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్‌ప్లేతో ప్రీమియం క్యాబిన్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకు మద్దతు ఇస్తుంది. కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, అప్‌డేటెడ్ క్లైమేట్ కంట్రోల్ ఇంటర్ ఫేస్లో అమర్చబడి ఉంది. బాలెనో 9 అంగుళాల కెపాసిటివ్ టచ్‌ను, వాయిస్ అసిస్టెంట్, ఆపిల్ కార్ ఆటోతో కనెక్టివిటీని అందిస్తుంది. ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఆకట్టుకుంటుంది. 

మైలేజ్

టాటా ఆల్టోజ్ ఫేస్లిఫ్ట్ పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వెర్షన్లు వివిధ రకాల మైలేజ్‌ను అందిస్తాయి. పెట్రోల్ వేరియంట్ ఏఆర్ఏఐ క్లెయిమ్ చేసిన మైలేజ్ 19.33 కిలోమీటర్లు, డీజిల్ వేరియంట్ 23.64 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజ్ను అందిస్తుంది. అలాగే సీఎన్‌జీ వేరియంట్ కేజీకు 26.2  కిలోమీటర్ల అందిస్తుంది. మారుతి సుజుకి బాలెనో మాన్యువల్ పెట్రోల్ వేరియంట్‌కు 22.35 కిలోమీటర్ల మైలేజ్, ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్‌కు 22.94 కిలోమీటర్ల మైలేజీని ఏఆర్ఏఐ క్లెయిమ్ చేసిన మైలేజీతో ఆకట్టుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

భద్రత

టాటా ఆల్ట్రోజ్ ఫేస్ అప్లై ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు ఈఎస్‌పీ, హిల్ హెరాల్డ్ అసిస్ట్, ఫాగ్ ల్యాంప్స్, 360 డిగ్రీ కెమెరా, ఎస్ఓఎస్ కాల్ ఫంక్షన్ వంటి భద్రతా లక్షణాలు ఆకట్టుకుంటున్నాయి. మారుతి సుజుకి బాలెనోలో ఈఎస్‌పీ, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో ఏబీఎస్, హిల్ హెూల్డ్ అసిస్ట్, 360-డిగ్రీ వ్యూ కెమెరా ఉన్నాయి. ఈ కారు భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ పరీక్షల్లో 5 స్టార్ రేటింగ్‌తో ఆకట్టుకుంటుంది. 

ధర

టాటా ఆల్టోజ్ ఫేస్లిఫ్ట్, మారుతి సుజుకి బాలెనో రెండూ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపికలుగా ఉంటాయి. టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో ఆల్ట్రోజ్ ఫేస్లిఫ్ట్‌ను రూ.6.98 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిచయ ధరతో విడుదల చేయగా, మారుతి సుజుకి బాలెనో రూ. 6.70 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభమవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి