Swiggy Food Delivery: స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు.. ఎక్కువ మంది తిన్న ఫుడ్ ఏంటంటే?

|

Dec 23, 2024 | 8:39 PM

ఈ ఏడాది స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ సంస్థ ఓ రిపోర్టు విడుదల చేసింది. ఆ రిపోర్టులో ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. ఈ ఏడాది భారతదేశంలో 83 మిలియన్ల బిర్యానీ ఆర్డర్‌లు వచ్చినట్లు చెప్పారు. జనవరి 1, 2024 నుంచి నవంబర్ 22, 2024 మధ్య సేకరించిన డేటాపై ఈ నివేదకను విడుదల చేశారు.

1 / 6
Swiggy 2024 సంవత్సరానికి సంబంధించిన ఓ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.  జనవరి 1, 2024 నుంచి నవంబర్ 22, 2024 మధ్య సేకరించిన డేటాపై ఈ నివేదకను విడుదల చేశారు.

2 / 6
గత సంవత్సరం మాదిరిగానే, బిర్యానీ భారతదేశంలో పాపులార్‌గా నిలిచింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్‌గా బిర్యానీ నిలిచింది. 2024లో స్విగ్గీ 83 మిలియన్ల బిర్యానీ ఆర్డర్‌లను అందుకుంది. దీని ప్రకారం దేశంలో నిమిషానికి 158 బిర్యానీలు (ప్రతి సెకనుకు దాదాపు 2 ఆర్డర్‌లు) ఆర్డర్ వచ్చాయి.

3 / 6
బిర్యానీ తర్వాత, స్విగ్గీ దోస ప్రజాదరణ పొందింది. అందులో ఈ సంవత్సరం 23 మిలియన్ ఆర్డర్‌లను వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. చికెన్ బిర్యానీని ఎక్కువ మంది ఇష్టపడినట్లు తెలిపింది.

4 / 6
స్విగ్గీకి ఈ ఏడాది 49 మిలియన్ ఆర్డర్లు వచ్చాయి. ఈ స్విగ్గీ ఆర్డర్‌లలో ఎక్కువ భాగం దక్షిణాది రాష్ట్రాల ప్రజలే ఉండడం గమనార్హం. . 2024లో 9.7 మిలియన్ బిర్యానీ ఆర్డర్‌లతో "బిర్యానీ లీడర్‌బోర్డ్"లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది.

5 / 6
దాని తర్వాత బెంగళూరు (7.7 మిలియన్ ఆర్డర్లు), చెన్నై (4.6 మిలియన్లు) ఉన్నాయి.  రాత్రి 12 నుండి 2 గంటల మధ్య చికెన్ బర్గర్స్‌ను ఎక్కువ మంది ఆర్డర్ చేసుకోగా, బిర్యానీ దాని తర్వాత స్థానంలో ఉంది.

6 / 6
రైళ్లలో సర్వసాధారణంగా ఆర్డర్ చేయబడిన ఆహారంలో బిర్యానీ కూడా ఒకటి అని స్విగ్గీ వెల్లడించింది. భారతదేశంలో రంజాన్ 2024 సందర్భంగా ప్లాట్‌ఫారమ్ ద్వారా సుమారు 6 మిలియన్ ప్లేట్ల బిర్యానీని ఆర్డర్ చేసినట్లు సంవత్సరం ప్రారంభంలో స్విగ్గీ వెల్లడించింది.