AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరెంత డ్రింక్ చేశారో.. మీ చెమటతో గుర్తిస్తారట..!

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల గురించి తెలిసిందే. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే.. ట్రాఫిక్ పోలీసులు బ్రీతలైజర్లను ఉపయోగించి అల్కాహాల్ టెస్ట్ చేస్తారు. ఆ సమయంలో పరిమితికి మించి మద్యం సేవించిన వారికి ఫెనాల్టీతో పాటు అరెస్ట్ కూడా చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో బ్రీతలైజర్ కీలకం. దీని ద్వారానే మద్యం సేవించిన వారిని నిర్ధారిస్తారు. అయితే ఇప్పుడు వాడే ఈ పరికరాల కాలం త్వరలో చెల్లిపోనుందట. ప్రస్తుతం బాగానే పనిచేస్తున్నా.. దీంతో […]

మీరెంత డ్రింక్ చేశారో.. మీ చెమటతో గుర్తిస్తారట..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 17, 2019 | 5:16 AM

Share

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల గురించి తెలిసిందే. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే.. ట్రాఫిక్ పోలీసులు బ్రీతలైజర్లను ఉపయోగించి అల్కాహాల్ టెస్ట్ చేస్తారు. ఆ సమయంలో పరిమితికి మించి మద్యం సేవించిన వారికి ఫెనాల్టీతో పాటు అరెస్ట్ కూడా చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో బ్రీతలైజర్ కీలకం. దీని ద్వారానే మద్యం సేవించిన వారిని నిర్ధారిస్తారు. అయితే ఇప్పుడు వాడే ఈ పరికరాల కాలం త్వరలో చెల్లిపోనుందట. ప్రస్తుతం బాగానే పనిచేస్తున్నా.. దీంతో అనేక సమస్యలు ఉన్నాయట. అందుకే వీటి స్థానంలో చెమట నుంచి ఆల్కహాల్‌ మోతాదును అంచనా వేసేందుకు ఓ కొత్త పద్ధతి, టెక్నాలజీ అందుబాటులోకి రానుందట.

న్యూయార్క్‌లోని అల్బేనీ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని అభివద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బ్రీతలైజర్లు.. మన శ్వాసలోని ఎథనాల్‌ మోతాదును లెక్కకట్టడం ద్వారా పనిచేసేవి. అయితే మౌత్‌వాష్‌‌కి సంబంధించినవి వాడితే.. రీడింగ్‌ మారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు.. కొందరు వ్యాధిగ్రస్థులకు ఈ బ్రీతలైజర్లు ఉపయోగిస్తే.. సరైన రీడింగ్‌లు వచ్చేవి కాదు. ఈ క్రమంలో వీటన్నింటికి చెక్ పెట్టేందుకు అల్బేనీ యూనివర్శిటీ సైంటిస్టులు ఈ కొత్త టెక్నాలజీని అభివద్ధి చేశారు. ఐస్‌క్రీమ్‌ స్టిక్‌ లాంటి ఓ స్టిక్‌పై మన చెమట చుక్కను వేస్తే సరిపోతుందట.. మద్యం సేవిస్తే.. ఓ రంగులో చుక్క కనిపిస్తుందట. అయితే ఈ రంగు ముదురుగా ఉంటే.. ఎక్కువ మద్యం సేవించినట్లుగా.. లేత రంగులో ఉంటే.. తక్కువ డ్రింక్ చేసినట్లుగా గుర్తిస్తారట. అయితే ఈ రంగుల తేడాలను గుర్తించడం కష్టమేమి కాదట. దీని కోసం ఓ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా రంగు అర్థాలను వివరించేందుకు ఏర్పాట్లు కూడా చేశారట. అనలిటికల్‌ కెమిస్ట్రీ మేగజైన్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను పేర్కొంది.

Follow Us
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..
గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..
గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు
పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు