
పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. మిడిల్ క్లాసోళ్లు బంగారం షాపుల వైపు కన్నెత్తి చూడాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈఎమ్‌ఐ పద్ధతిలోనైనా గోల్డు కొనుక్కునేలా వాళ్లకు వెసులుబాటునివ్వండి.. అని కాళ్లావేళ్లా బడ్డారు జ్యూయెలర్స్ అండ్ బులియన్ డీలర్లు. అది ఫిబ్రవరి మొదటివారం. అప్పట్లో బంగారం పది గ్రాముల ధర 77 వేలకు అటూఇటూ ఉండేది. ఇప్పుడైతే పాకుతూపాకుతూ లక్ష రూపాయాల దాకా వస్తోంది. మరి.. ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబస్థుడి ముఖచిత్రం ఏమిటో..? తులం బంగారం ఖరీదు అక్షరాలా లక్ష. ఆ మైలురాయి ఎంతో దూరంలో లేదు. ఇప్పట్లో పరుగు ఆపనంటోంది కనకమహాలక్ష్మి. బంగారం షాపులకెళితేనే అంత. జిగేల్‌మనే మెరుపుల్ని చూసి మనల్ని మనం మర్చిపోతాం.. కళ్లప్పగించి అలాగే చూస్తుండిపోతాం. వచ్చినపని మర్చిపోతాం. కాకపోతే.. ఒక విషయాన్నయితే అక్కడ ఖచ్చితంగా అబ్జర్వ్ చెయ్యొచ్చు. జ్యువెలరీ షాపుల్లో ఎక్కువగా మధ్యతరగతివాళ్లే కనబడతారు. మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ నుంచే అధిక మొత్తంలో పసిడి కొనుగోళ్లు జరుగుతాయని, చిన్నచిన్న వస్తువుల అమ్మకాలే షాపులను బతికిస్తాయని, బులియన్ మార్కెట్‌ని బలంగా నడుపుతాయని ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ అనే సంస్థ తన లేటెస్ట్ రిపోర్టు స్పష్టం చేసింది. అంటే.. ఏ నెల సంపాదన ఆ నెలకే సరిపెట్టుకోవడం.. అంతో ఇంతో మిగిలితే దాన్ని తీసుకెళ్లి అర తులమో, పావు తులమో బంగారం కొనిపెట్టుకోవడం సగటు మధ్యతరగతి జీవుడికుండే అలవాటు. గత ఐదేళ్లలో ఉన్నతాదాయ వర్గాల్లో 74 శాతం మంది బంగారం కొనుగోలు చేశారు. ఇందులో ‘ఏటా...