Success Story: లేడి క్వీన్.. ఒక్క ఆలోచన జీవితాన్నే మార్చేసింది.. ఇప్పుడు కోట్లు సంపాదన!

Success Story: చదువుకున్నా.. పెద్ద చదువులు చదువుకోలేకపోయినా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఈ మహిళ. చదువుకోలేదని బంధువులు, ఇతరులు ఎగతాళి చేసినా ఏ మాత్రం దిగులు చెందకుండా వ్యవసాయ రంగంలో తనదైన ముద్రి వేసకున్నారు. నిరక్షరాస్యురాలైనప్పటకీ ఇప్పుడు కోట్లాది రూపాయలు సంపాదిస్తుంది ఈ మహిళ..

Success Story: లేడి క్వీన్.. ఒక్క ఆలోచన జీవితాన్నే మార్చేసింది.. ఇప్పుడు కోట్లు సంపాదన!
Success Story

Updated on: Mar 23, 2026 | 12:50 PM

Success Story: తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాకు చెందిన పొన్నరాసి అనే మహిళా రైతు, మునగ (మోరింగా) సాగుతో తన జీవితాన్నే కాదు, కుటుంబ భవిష్యత్తును కూడా మార్చుకుంది. చదువు మధ్యలోనే ఆపేసిన ఆమె, కృషి మరియు పట్టుదలతో ఇప్పుడు సంవత్సరానికి సుమారు రూ.12 లక్షల ఆదాయం పొందుతూ “మోరింగా క్వీన్”గా గుర్తింపు పొందింది.

చిన్న ఆలోచన.. పెద్ద విజయం:

పొన్నరాసి వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగింది. పంటల కష్టం, వ్యవసాయ జీవితం ఆమెకు చిన్నప్పటినుంచే తెలుసు. కుటుంబానికి చెందిన 10 ఎకరాల భూమిలో మునగ సాగు ప్రారంభించింది. మొదట్లో ఆకులు, విత్తనాలు, వేర్లు అమ్మడం ప్రారంభించినా, మార్కెట్‌లో పోటీ ఎక్కువగా ఉండటంతో లాభాలు తగ్గిపోయాయి. విత్తనాల ధరలు కిలోకు రూ.5 వరకు పడిపోయాయి. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు.

కుమార్తె ఇచ్చిన ఐడియాతో మార్పు:

తన కుమార్తె సూచనతో మునగ విత్తనాల నుంచి నూనె తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఇది ఆమె జీవితాన్ని మార్చిన కీలక మలుపు అయింది. ఈ ఆలోచనను అభివృద్ధి చేసేందుకు ఆమె ట్రైనింగ్ తీసుకుని, ప్రాసెసింగ్, “వాల్యూ యాడిషన్” గురించి నేర్చుకుంది. కోయంబత్తూర్‌లోని వ్యవసాయ కాలేజీ సందర్శన సమయంలో వ్యవసాయ నిపుణుడు జాన్ కెన్నెడీ (John Kennedy)ను కలవడం ఆమెకు మరింత మార్గదర్శకత్వం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Chicken Prices Hike: మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన చికెన్‌ ధర

వాల్యూ యాడిషన్‌తో భారీ విజయం:

వాల్యూ యాడిషన్ ద్వారా ముడి పదార్థాలను అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చడం నేర్చుకున్న తర్వాత ఆమె వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది.

“మోరింగా అరసి” అనే బ్రాండ్‌తో:

  • మోరింగా ఆయిల్
  • పౌడర్లు
  • సబ్బులు
  • షాంపూలు
  • లిప్ బామ్‌లు
  • సూప్ పౌడర్లు
  • మొత్తం 36కు పైగా ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది.

Gold Price: భారీ పతనం.. రూ.19 వేలు తగ్గిన బంగారం ధర.. వెండి రూ.55 వేలు.. తులం ధర రూ.1 లక్షకు చేరుతుందా?

అంతర్జాతీయ మార్కెట్‌లో అడుగులు:

ప్రభుత్వ మహిళా వ్యాపార ప్రోత్సాహక పథకం కింద రూ.2 లక్షల సబ్సిడీతో ఆమె ఒక “ప్యాక్ హౌస్” ఏర్పాటు చేసింది. దీంతో ఉత్పత్తుల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ సులభమైంది.
ఆమె ఉత్పత్తులు కేవలం భారతదేశంలోనే కాదు:

  • మలేషియా
  • సింగపూర్
  • అమెరికా
  • ఫ్రాన్స్
  • మస్కట్ – వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

సోషల్ మీడియా శక్తితో వ్యాపారం:

పొన్నరాసి తన ఉత్పత్తులను మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తోంది. Facebook, WhatsApp ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ వ్యాపారాన్ని విస్తరించింది.

అవార్డులు, గుర్తింపు:

ఆమె కృషిని గుర్తించి త్రిచీ కలెక్టర్ “బెస్ట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు”తో సత్కరించారు. ప్రజలు ప్రేమగా ఆమెను “మోరింగా క్వీన్” (మురుంగై అరసి) అని పిలుస్తున్నారు. పొన్నరాసి కథ కేవలం ఒక మహిళ విజయగాథ మాత్రమే కాదు. ఇది పట్టుదల, ఆవిష్కరణ, కష్టానికి ప్రతిఫలం. చిన్న స్థాయిలో ప్రారంభించి, వాల్యూ యాడిషన్ ద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదగడం. ఇది ప్రతి రైతు, ప్రతి యువ పారిశ్రామికవేత్తకు ప్రేరణగా నిలుస్తోంది.

Best Scheme: బంపర్ స్కీమ్‌.. కేవలం 10 ఏళ్లలో రూ.25 లక్షలకుపైగా సంపాదించే మార్గం గురించి మీకు తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us