Earth Energy EV Bikes: భారతీయ సంతతికి చెందిన గ్లోబల్ ఆటోమోటివ్ స్టార్టప్ ఎర్త్ ఎనర్జీ ఈవీ తాజాగా3 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. ఇందులో గ్లైడ్ +, ఎవాల్వ్ ఆర్, ఎవాల్వ్ ఎక్స్ ఉన్నాయి. వీటి ధరలు 92,000 నుంచి రూ.1,42,000 వరకు ఉన్నాయి. ఇవి మూడు రంగుల్లో మార్షల్ గ్రే, జెట్ బ్లాక్ మరియు వైట్ అందుబాటులో ఉన్నాయి.
ఎర్త్ ఎనర్జీ వాహనాలన్నీ ఇన్‌బిల్ట్ స్మార్ట్‌ఫోన్‌లతో వస్తాయి, ఇది వాహనాలు నడిపేవారికి లైవ్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్స్ / మెసేజ్ అలర్ట్ ,ట్రిప్ హిస్టరీ, ప్రస్తుత గమ్యాన్ని స్క్రీన్‌పై చూపిస్తాయి. ఈ సందర్భంగా ఎర్త్ ఎనర్జీ సంస్థ CEO, వ్యవస్థాపకుడు రుషి ఎస్ మాట్లాడుతూ మా మొదటి శ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్రయోగాన్ని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నామన్నారు. పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన, పెట్రోల్ ధరలు పెరగడం వంటి కారణాల వల్ల భారతదేశంలో ఈవీ పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గతంలో కంటే ఇప్పుడు పెరుగుతుందని ఆకాక్షించారు.
మహారాష్ట్రకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎర్త్ ఎనర్జీ ఈవీని 2017లో రుషి షెంఘని స్థాపించారు. ఈ సంస్థ ఇటీవలే కొత్త వాహనాలను విడుదల చేసింది. ఇందులో ఎవాల్వ్ఆర్ అనే పేరుతో పిలిచే ఈ బైక్‌కు B605 అని సంకేతనామం పెట్టారు. మన దేశంలో కేవలం మూడు క్రూయిజర్‌లు మాత్రమే ఉన్నాయి – అందులో సుజుకి ఇంట్రూడర్ 150, బజాజ్ అవెంజర్ సిరీస్. ఆ తరువాత ఎవాల్వ్ఆర్ క్రూయిజర్ మాత్రమే. ఇది బజాజ్ అవెంజర్ మాదిరిగా కనిపిస్తుంది.