దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజులగా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. మదుపర్ల అప్రమత్తతో ఈ ఉదయం స్వల్ప లాభాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. మార్కెట్ ఆరంభంలో లాంభంతో ట్రేడ్ అయినా.. ముగిసే సరికి భారీ నష్టాన్ని చవిచూసాయి. జీ 20 సదస్సులో ట్రంప్, ప్రధాని మోదీల మధ్య జరిగిన సమావేశం కూడా మార్కెట్లలలో ఉత్సాహం నింపలేకపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. కాగా.. 191 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 39,394 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 52 పాయింట్లకు పతనమై 11,788 వద్ద ముగిసింది.