ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

| Edited By:

Aug 07, 2019 | 10:50 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.36 గంటల సమయంలో సెన్సెక్స్ 15 పాయింట్ల లాభంతో 36992 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ మూడు పాయింట్లు నష్టపోయి 10946 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.92గా ఉంది. ప్రారంభంలోనే ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, టైటాన్‌, టాటా స్టీల్‌, వేదాంత, కోల్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్టీపీసీ తదితర కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. యస్‌ బ్యాంక్‌, […]

ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.36 గంటల సమయంలో సెన్సెక్స్ 15 పాయింట్ల లాభంతో 36992 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ మూడు పాయింట్లు నష్టపోయి 10946 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.92గా ఉంది.

ప్రారంభంలోనే ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, టైటాన్‌, టాటా స్టీల్‌, వేదాంత, కోల్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్టీపీసీ తదితర కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. యస్‌ బ్యాంక్‌, హిందాల్కో, బజాజ్‌ ఆటో, ఐవోసీ తదితర కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.