
హోలీ సందర్భంగా దక్షిణ మధ్య లైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హోలీ పండుగ సందర్భంగా సెలవులు రానుండటంతో చాలామంది తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న క్రమంలో రైల్వేశాఖ ముందగానే అలర్ట్ అయింది. ప్రజల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోలీ సందర్భంగా 160 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు వేరే రాష్ట్రాలకు ఇవి సర్వీసులు అందించనున్నాయి.
ప్రయాణికలు రద్దీగా అనుగుణంగా మార్చిలో హోలీ సందర్భంగా 160 ప్రత్యేక రైళ్లను తిప్పనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ప్రధాన నగరాల మధ్య ఇవి కనెక్టివిటీని పెంచుతాయని తెలిపింది. మార్చిలో ఇవి సర్వీసులు అందిస్తాయని, సౌత్ సెంట్రల్ పరిధిలో ఇవి సేవలు అందిస్తాయని స్పష్టం చేసింది. విశాఖపట్నం, పాట్నా, రాజ్ కోట్, సోలాపూర్, బిలాస్ పూర్, దానాపూర్, రాక్సువల్, షాలీమార్, లక్నో, సంత్రగాచి, మలాదా టౌన్, చాప్రా లాంటి ప్రధాన నగరాలకు తిరుగనున్నట్లు తెలిపింది. ప్రయాణికులు వేగంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు ఇవి ఉపయోగపడతాయంది. దూర ప్రాంతాలకు నేరుగా కనెక్టివిటీ ఉండేలా వీటిని తిప్పనుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నామని రైల్వేశాఖ పేర్కొంది.
SCR to Run 160 Special Trains on the Eve of #HoliFestival #HoliSpecialTrain pic.twitter.com/vnTjPuG5l5
— South Central Railway (@SCRailwayIndia) February 5, 2026
అటు దేశవ్యాప్తంగా ఏకంగా 1500 ప్రత్యేక రైళ్లను హోలీ సందర్భంగా రైల్వేశాఖ తిప్పనుంది. 2025 హోలీ సందర్భంగా 1144 స్పెషల్ రైళ్లను తిప్పగా.. ఈ సారి ఆ సంఖ్యను మరింత పెంచారు. దేశ నలుమూలకు కనెక్టివిటీ పెరిగేలా ఈ ప్రత్యేక రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. అటు దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సౌకర్యాలను పెంచేందుకు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 172 స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. మొత్తం ఈ పథకం ద్వారా 1337 స్టేషన్లను పున:నిర్మించాలని నిర్ణయించగా.. 172 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి. ఇక 2022-25 మధ్య 8626 రైల్వే బ్రిడ్జిలకు మరమ్మత్తులు చేశారు.