Smartphones: ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న 10 ఫోన్‌లు ఇవే..!

|

Nov 12, 2024 | 7:44 PM

Smartphones: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ ఫోన్ల హవా కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త మోడల్‌ స్మార్ట్‌ ఫోన్లు విడుదలవుతున్నాయి. తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్‌ ఉండేలా మొబైల్‌లను విడుదల చేస్తున్నాయి కంపెనీలు. అత్యధికంగా అమ్ముడైన 10 స్మార్ట్‌ ఫోన్ల గురించి తెలుసుకుందాం..

Smartphones: ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న 10 ఫోన్‌లు ఇవే..!
Follow us on

ఈ ఏడాది మూడో త్రైమాసికంలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు ప్రజలకు పెద్దగా నచ్చలేదు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో మూడవ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌ల గురించి తెలిపింది. ఈ జాబితాలో Apple, Samsung సంస్థలున్నాయి. కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం.. ఆపిల్‌కు చెందిన iPhone మళ్లీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్‌గా అవతరించింది. ప్రజలు ఐఫోన్ 15 సిరీస్‌ను చాలా ఇష్టపడ్డారు. ఇది కాకుండా, ప్రో మోడల్స్ కూడా పెద్ద సంఖ్యలో విక్రయాలు జరిగాయి. శాంసంగ్‌ కంపెనీకి చెందిన Samsung Galaxy S24 ఫోన్ కూడా బాగా అమ్ముడైంది. ఈ ఫోన్ బెస్ట్ సెల్లింగ్ డివైజ్‌లలో కూడా తన స్థానాన్ని సంపాదించుకుంది.

టాప్ 3లో యాపిల్ ఫోన్లు:

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 ఫోన్‌లలో ఆపిల్ నిలిచింది. ఇందులో యాపిల్ ఐఫోన్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇందులో కూడా ఐఫోన్ ప్రో మోడల్స్ ఎక్కువగా అమ్ముడయ్యాయి. విక్రయాలు జరిగిన ఐఫోన్లలో సగం ఈ మోడళ్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా అమ్ముడైన ఫోన్లు:

మార్కెట్ రీసెర్చ్ సంస్థ నివేదిక ప్రకారం.. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్లు.

iPhone 15

iPhone 15 Pro Max

iPhone 15 Pro

Galaxy A15 4G

Galaxy A15 5G

Galaxy A35 5G

Galaxy A05

iPhone 14

Redmi 13C 4G

Galaxy S24

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ల ఆధిపత్యం:

శాంసంగ్ ఈ లిస్ట్‌లో టాప్ 3లోకి రాకపోయినప్పటికీ, 10 ఫోన్‌లలో 6 దీనికి చెందినవే. Samsung Galaxy A15 4G ఫోన్ అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్‌లలో మూడవ స్థానంలో ఉంది. అదే సమయంలో నాల్గవ స్థానంలో A15 5G మోడల్ ఉంది. Samsung Galaxy S24 ఫోన్ కూడా బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌ల జాబితాలో 10వ స్థానంలో ఉంది. శాంసంగ్‌తో పాటు, షియోమీ కూడా ఈ జాబితాలో తన స్థానాన్ని సంపాదించుకుంది.

ఇది కూడా చదవండి: MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హృదయాన్ని కదిలించిన అంధ యువకుని పాట.. కిరవాణి గారూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి!


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి