న్యూఇయర్‌కు ముందే సామాన్యులపై మరో పిడుగు.. భారీగా పెరగనున్న వీటి ధరలు..

న్యూఇయర్‌కు ముందే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్ తగలనుంది. స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశముంది. డిసెంబర్ నాటికి ధరలు భారీగా పెరగవచ్చని నివేదికలు చెబుతున్నాయి. డిసెంబర్ చివరి నాటికి 30 శాతం మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఏఐనే అని అంటున్నారు.

న్యూఇయర్‌కు ముందే సామాన్యులపై మరో పిడుగు.. భారీగా పెరగనున్న వీటి ధరలు..
Smartphones

Updated on: Nov 22, 2026 | 10:46 AM

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి సూపర్ న్యూస్. స్మార్ట్‌ఫోన్‌లు ధరలు మరింత పెరగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ప్రీమియం మొబైల్ ఫోన్ల ధరలు 30 శాతం వరకు పెరిగే అవకాశముందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏఐ టెక్నాలజీ టెక్నాలజీ విస్తరణ, చిప్‌ల కొరత, వంటివి మొబైల్ ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగడంతో ప్రస్తుతం ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పడుతుండగా.. ఈ ఏడాది చివరి నాటికి  సామాన్యుడి జేబుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్‌ల నిర్మాణం భారీగా పెరుగుతోంది. ఈ డేటా సెంటర్‌లకు పెద్ద మొత్తంలో మెమొరీ చిప్స్ అవసరం ఉంటుంది. దీంతో RAM, NAND, స్టోరేజ్ చిప్స్‌కు డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా పెరిగింది. ఏఐ కంపెనీలు డేటా సెంటర్ల కోసం భారీగా మెమొరీ చిప్స్‌ను కొనుగోలు చేస్తుండటంతో అంతర్జాతీయ మెమెరీ చిప్‌ల కొరత  ఏర్పడింది. దీంతో  స్మార్ట్‌ఫోన్‌ల తయారీకి కూడా మెమొరీ చిప్స్ అవసరం. వీటికి అవసరమైన చిప్‌ల సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.

చిప్ తయారీ సంస్థలు అధిక లాభాలు వచ్చే ఏఐ మెమొరీ ఉత్పత్తుల వైపు తమ దృష్టిని మళ్లిస్తున్నాయి. దీనివల్ల సాధారణ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థలకు విడిభాగాల ఖర్చు బాగా పెరుగుతోంది. ఇప్పటికే మెమొరీ చిప్‌ల ఖర్చు ఒక్కో ఫోన్‌కు గతంలో సుమారు 20 డాలర్ల ఉండగా.. ప్రస్తుతం 60 నుంచి 65 డాలర్లకు చేరుకుంది. తక్కువ ధరకు ఫోన్ అందించాలనుకునే కంపెనీలకు కూడా ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ భారాన్ని కంపెనీలు చివరికి వినియోగదారులపైనే మోపుతున్నాయి. ఈ ధరల పెరుగుదల బడ్జెట్ ఫోన్లపై పడుతోంది. ముఖ్యంగా రూ. 10 వేల నుంచి రూ. 20 వేలలోపు ఫోన్లు కొనుగోలు చేసే వినియోగదారులపై ఎక్కువగా ఉండనుంది.  అయితే 200 డాలర్ల లోపు ధర కలిగిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు దాదాపు 30 శాతం పెరిగే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఫోన్‌ల ధరలు పెరిగితే సామాన్య వినియోగదారుల కొనుగోలు ప్రణాళికలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కొత్త ఫోన్ కొనాలనుకునేవారు మరికొంత కాలం పాత ఫోన్‌తోనే సరిపెట్టుకోవాల్సి రావచ్చని భావిస్తున్నారు.

ఈ ధరల భారం భరించలేక కొత్త ఫోన్‌కు బదులుగా సెకండ్ హ్యాండ్ ఫోన్లను ఆశ్రయించే పరిస్థితి కూడా రావచ్చనేద నిపుణుల అభిప్రాయం. ఇక కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు పలు మార్గాల కోసం వెతుకులాట మొదలుపెట్టాయి. తక్కువ ధర మోడళ్ల సంఖ్యను తగ్గించడం, తక్కువ స్టోరేజ్ వేరియంట్‌లను తీసుకురావడం, పాత తరానికి చెందిన ప్రాసెసర్‌లను వినియోగించడం వంటివి చూస్తున్నాయి. AI విప్లవం టెక్నాలజీ రంగానికి కొత్త అవకాశాలు తెస్తుంటే.. అదే AI ప్రభావం సామాన్యుడికి స్మార్ట్‌ఫోన్‌ను మరింత ఖరీదైన వస్తువుగా మార్చుతున్నాయి. ఒకప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాలన్న లక్ష్యంతో కంపెనీలు తక్కువ ధరల్లో ఫోన్‌లను అందించాయి. కానీ ఇప్పుడు ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ కారణంగా అదే స్మార్ట్‌ఫోన్ సామాన్యుడికి భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us