
సాధారణంగా ఇంట్లో కరెంట్ బిల్లు ఎక్కువగా రాగానే అందరి అనుమానం ఏసీ, కూలర్ లేదా రిఫ్రిజిరేటర్ల మీదికే వెళ్తుంది. కానీ మన కళ్ల ముందే ఉంటూ రోజూ గంటల తరబడి నడిచే స్మార్ట్ టీవీ కూడా మీ విద్యుత్ బిల్లును భారీగా పెంచుతోందని మీకు తెలుసా? ఈ రోజుల్లో స్మార్ట్ టీవీలు కేవలం కేబుల్ ఛానెళ్లకే పరిమితం కాలేదు. OTT స్ట్రీమింగ్, గేమింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ అంటూ నిరంతరాయంగా ఆన్‌లోనే ఉంటున్నాయి. స్మార్ట్ టీవీ ఎంత పెద్దదిగా ఉండి, ఎక్కువ ఫీచర్లు కలిగి ఉంటే అది అంత ఎక్కువ కరెంట్ లాగుతుంది. టీవీల స్క్రీన్ సైజును బట్టి గంటకు ఎంత విద్యుత్ ఖర్చవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
32 ఇంచెస్ టీవీ: గంటకు సుమారు 30 నుండి 60 వాట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తుంది.
43 నుండి 55 ఇంచెస్ LED స్మార్ట్ టీవీ: గంటకు 50 నుండి 120 వాట్ల వరకు విద్యుత్‌ను వాడుకుంటుంది. అంటే గంటకు సుమారుగా 0.05 నుండి 0.12 యూనిట్ల శక్తి ఖర్చవుతుంది.
పెద్ద స్క్రీన్లు – హై బ్రైట్‌నెస్: టీవీ సైజు ఇంకా పెద్దదై, బ్రైట్‌నెస్ సెట్టింగ్స్ అత్యధికంగా ఉంటే.. కొన్ని మోడళ్లు గంటకు ఏకంగా 300 నుండి 500 వాట్స్ వరకు కూడా కరెంట్‌ను గుంజే అవకాశం ఉంది.
మనం రోజూ సగటున 8 గంటల పాటు టీవీ చూస్తామని అనుకుంటే, నెలవారీ బిల్లు అంచనా ఇలా ఉంటుంది..
40 – 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ: నెలకు 24 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. దీనికి నెలకు రూ.192 వరకు బిల్ రావడం జరుగుతుంది.
55 ఇంచెస్ టీవీ: నెలకు 25 నుండి 35 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. దీనికి రూ. 200 నుండి రూ. 280 కరెంట్ ఛార్జీలు వస్తాయి.
మల్టీ టాస్కింగ్ ఫీచర్లు: కేవలం టీవీ చూడటమే కాకుండా హై-ఎండ్ గేమింగ్ అప్లికేషన్లు రన్ చేయడం, హెచ్‌డీ క్వాలిటీలో ఓటీటీ కంటెంట్ స్ట్రీమింగ్ చేయడం వల్ల ప్రాసెసర్లపై భారం పడి కరెంట్ వినియోగం పెరుగుతుంది.
బ్రైట్‌నెస్ సెట్టింగ్స్: టీవీలో బ్రైట్‌నెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెట్టుకోవడం వల్ల డిస్‌ప్లే బ్యాక్‌లైట్ ఎక్కువ పవర్ తీసుకుంటుంది.
నిరంతర వాడకం: ఇంట్లో ఎవరూ లేకపోయినా లేదా చూడకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో టీవీ ఆన్ చేసి ఉంచడం వల్ల నెలాఖరుకు బిల్లులో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
టీవీ చూసేటప్పుడు బ్రైట్‌నెస్‌ను రూమ్ లైటింగ్‌కు తగ్గట్టుగా ఎకో మోడ్ లేదా ఆటో మోడ్‌లో ఉంచడం మంచిది. అలాగే ఉపయోగించనప్పుడు కేవలం రిమోట్‌తోనే కాకుండా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా పవర్ సేవ్ చేయవచ్చు.