Silver Price: లక్షా 50 వేలు తగ్గిన వెండి ధర.. మరో రూ.50 వేలు తగ్గనుందా? నిపుణులేమంటున్నారు?

Silver Price: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. ఎన్నడు లేని విధంగా పరుగులు పెట్టిన వెండి ధర.. ఇప్పుడు రికార్డు స్థాయిలో పడిపోతుంది. రానున్న రోజుల్లో ఇంకా భారీ స్థాయిలో పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు..

Silver Price: లక్షా 50 వేలు తగ్గిన వెండి ధర.. మరో రూ.50 వేలు తగ్గనుందా? నిపుణులేమంటున్నారు?
Silver Price

Updated on: Feb 18, 2026 | 8:27 PM

Silver Price: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగి వస్తున్నాయి. వెండి విషయానికొస్తే ఎన్నడు లేని విధంగా పరుగులు పెట్టగా, ప్రస్తుతం అంతే స్థాయిలో పతనం అవుతోంది. అయితే, బంగారం, వెండి ధరలు ఇప్పటికీ వాటి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల కంటే చాలా తక్కువగా ఉన్నందున, బంగారం, వెండి పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశాన్ని అందిస్తుంది.

అయితే బులియన్ మార్కెట్‌లో వెండి ధరల పతనం ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం గడచిన 19 రోజుల్లోనే కిలో వెండి ధర ఏకంగా లక్షా 50 వేల రూపాయల మేర దిగిరావడం ఇన్వెస్టర్లను, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత నెల చివరలో రూ.4లక్షల10 వేల ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరిన వెండి. ప్రస్తుతం రూ.2 లక్షల 60 వేల దిగువకు ట్రేడవుతోంది. ఈ భారీ పతనం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో వెండి ఎంత వరకు తగ్గుతుందో నివేదికల ద్వారా తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Auto News: 7 సీట్ల కారు కేవలం రూ.5.65 లక్షలకే.. బేస్‌ మోడల్‌లోనే అద్భుతమైన ఫీచర్స్‌!

ఇవి కూడా చదవండి

బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం వెండి ధరల పతనానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. 1. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వేచి చూసే ధోరణిని అవలంబించడం, అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడటం వెండి ధరలపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఇక అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలు (COMEX) వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై మార్జిన్లను పెంచడంతో, ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను వదిలించుకోవాల్సి రావటం రెండో కారణంగా ఉంది. ఇక చివరిగా ఈ నెల ప్రారంభంలో వెండి కేజీ రూ.4 లక్షలు దాటాక పెట్టుబడిదారులు లాభాలు బుక్ చేసుకోవటం కూడా మార్కెట్లో రేట్లు ఒక్కసారిగా కుప్పకూలేలా చేశాయి

ఇంకా ఎంత తగ్గుతుంది?

రానున్న రోజుల్లో వెండి ధర భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ అంతర్జాతీయ పరిస్థితులు ఇంకా దిగజారితే లేదా అమెరికాలో వడ్డీ రేట్లు అనూహ్యంగా పెరిగితే మరో రూ.50 వేలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. అంటే అప్పుడు కిలో వెండి ధర 2 లక్షలకు పడిపోయే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us