స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టల్లో ముగిశాయి. భారతీయ ఈక్విటీ సూచీలు అన్ని రంగాలలో అమ్మకాల కారణంగా వరుసగా ఐదవ సెషన్‌లో నష్టపోయాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించిన తర్వాత పెట్టుబడిదారులు జాగ్రత్త పడ్డారు. బెంచ్‌మార్క్ BSE సెన్సెక్స్ 383 పాయింట్లు, (0.66 శాతం) పడిపోయి 57,301 వద్ద ముగిసింది. విస్తృత ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 114 పాయింట్లు (0.67 శాతం) క్షీణించి 17,092 వద్ద ముగిసింది.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.02 శాతం పతనమైంది. స్మాల్ క్యాప్ షేర్లు 2.05 శాతం క్షీణించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాల్లోకి సైన్యాన్ని పంపాలని ఆదేశించడంతో మార్కెట్లపై ఒత్తిడి పెంచిందని క్యాపిటల్వియా గ్లోబల్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ అన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 15 సెక్టార్ స్టాక్‌లు నష్టపోయాయి. నిఫ్టీ పిఎస్‌యు, నిఫ్టీ మెటల్ వరుసగా 1.48 శాతం, 1.11 శాతం తగ్గడం ద్వారా ఇండెక్స్‌ను బలహీనపరిచాయి. టాటా స్టీల్ 4.05 శాతం తగ్గింది. బీపీసీఎల్, టీసీఎస్, ఎస్‌బీఐ లైఫ్, టాటా మోటార్స్ కూడా నష్టపోయాయి. M&M, బజాజ్ ఫిన్‌సర్వ్, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, హిందాల్కో లాభాల్లో ముగిశాయి. BSEలో 691 షేర్లు పురోగమించగా, 2,665 క్షీణించాయి.
30-షేర్ల బిఎస్‌ఇ ప్లాట్‌ఫామ్‌లో, టాటా స్టీల్, టిసిఎస్, ఎస్‌బిఐ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటిసిలు తమ షేర్లు 3.64 శాతం వరకు పడిపోయాయి. “మార్కెట్ 17,000 స్థాయి కంటే ఎక్కువ నిలదొక్కుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతానికి, స్వల్పకాలిక సాంకేతిక పరిస్థితి అంచనా రేంజ్ 16,800 మధ్య ఉండవచ్చని చూపిస్తుంది. ” అని క్యాపిటల్‌వియా గ్లోబల్ రీసెర్చ్ లిమిటెడ్‌లోని టెక్నికల్ రీసెర్చ్ లీడ్ విజయ్ ధనోతియా చెప్పారు.