Stock Market: వెంటాడిన యుద్ధ భయాలు.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 778, నిఫ్టీ 188 పాయింట్లు డౌన్‌..

|

Mar 02, 2022 | 4:17 PM

అంతర్జాతీయ పరిణామాలతో భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై..

Stock Market: వెంటాడిన యుద్ధ భయాలు.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 778, నిఫ్టీ 188 పాయింట్లు డౌన్‌..
Stock Market
Follow us on

అంతర్జాతీయ పరిణామాలతో భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తుండడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో మార్కెట్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. ముడి చములు ధర పెరగడం కూడా మర్కెట్‌పై ప్రభావం చూపించింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 110 డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడయ్యాయి. జూలై 2014 తర్వాత ఇదే అత్యధిక ధర. బెంచ్‌మార్క్ BSE సెన్సెక్స్ 778 పాయింట్లు క్షీణించి 55,469 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 188 పాయింట్లు తగ్గి 16,606 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.02 శాతం తగ్గింది. అయితే స్మాల్ క్యాప్ షేర్లు 0.50 శాతం పెరిగాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సెక్టార్ గేజ్‌లు తక్కువలో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో 2.96 శాతం, నిఫ్టీ బ్యాంక్ 2.30 శాతం వరకు పడిపోయాయి. అయితే నిఫ్టీ మెటల్ 4.07 శాతం పెరిగింది. మారుతి సుజికీ ఇండియా టాప్ నిఫ్టీ లూజర్‌గా నిలిచింది. ఈ స్టాక్ 6 శాతం పడిపోయి రూ. 7,815.15కి చేరుకుంది. డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్ నష్టాలను చవిచూశాయి. BSEలో 1,709 షేర్లు పెరగ్గా, 1,633 క్షీణించాయి. 30 షేర్ల బిఎస్‌ఇ ఇండెక్స్‌లో మారుతీ, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ (హెచ్‌డిఎఫ్‌సి మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్), సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ నష్టపోయాయి.

Read Also.. Petrol Price Hike: వాహనదారులకు దిమ్మతిరిగే వార్త.. లీటర్ పెట్రోల్ ధర డబుల్ సెంచరీకి.. వార్ ఎఫెక్ట్..