Indian Railways: దసరాకు ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో ఇప్పటికీ సీట్లు ఖాళీ.. వెంటనే బుకింగ్ చేస్కోండి..

దసరా, దీపావళికి సొంతూరు వెళ్తున్నారా..? ట్రైన్లలో సీట్లు దొరకవని ఆందోళన పడుతున్నారా..? అయితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అనేక మార్గాల్లో ప్రవేశపెట్టింది. ఈ రైళ్లల్లో ఇప్పటికే సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఏయే ట్రైన్‌లో ఎన్ని బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయనే వివరాలను రైల్వేశాఖ ప్రకటించింది.

Indian Railways: దసరాకు ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో ఇప్పటికీ సీట్లు ఖాళీ.. వెంటనే బుకింగ్ చేస్కోండి..
Indian Railways

Updated on: Oct 12, 2026 | 1:38 PM

దసరా, దీపావళి పండుగల సందర్బంగా సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్, నవంబర్‌లో వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్రైన్లలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టింది. అయితే ప్రయాణికులు ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక రైళ్లల్లో ఖాళీగా ఉన్న బెర్త్‌ల సంఖ్యను రైల్వేశాఖ ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. దీని వల్ల బెర్త్‌లు ఖాళీలు ఉన్నట్లు గుర్తించి ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వివరాలను ప్రతీరోజుల రైల్వేశాఖ విడుదల చేస్తూ వస్తోంది. అక్టోబర్ 11 రాత్రి 8 గంటలకు నాటికి పలు రైళ్లల్లో ఖాళీగా ఉన్న బెర్త్‌ల సంఖ్యను ప్రకటించింది.

పండుగ సెలవుల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. తిరుపతి మార్గంలో పలు ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా.. వీటిల్లో చాలా బెర్త్‌లు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. జల్నా–తిరుపతి(07814) రైలులో అక్టోబర్ 15న 218, అక్టోబర్ 22న 158, అక్టోబర్ 29న 512 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇక నవంబర్ 5న 597, నవంబర్ 19న 451, నవంబర్ 26న 690 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అలాగే హజూర్ సాహిబ్ నాందేడ్–తిరుచానూరు(07603) రైలులో అక్టోబర్ 13న 487, అక్టోబర్ 20న 708, అక్టోబర్ 27న 784 బెర్తులు, నవంబర్ 3న 899, నవంబర్ 10న 513, నవంబర్ 17న 848, నవంబర్ 24న 898 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.

బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు కూడా పలు రైళ్లల్లో బెర్తులు ఖాళీగా ఉన్నాయి. జల్నా–యెలహంక(07601) రైలులో అక్టోబర్ 18న 767, అక్టోబర్ 25న 621 బెర్త్‌లు ఉన్నాయి. చర్లపల్లి–SMVT బెంగళూరు(07065) రైలులో అక్టోబర్ 12న 190, అక్టోబర్ 19న 632, అక్టోబర్ 26న 702 బెర్తులు, నవంబర్ 2న 762, నవంబర్ 9న 752, నవంబర్ 16న 761, నవంబర్ 23న 764, నవంబర్ 30న 746 బెర్తులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. చర్లపల్లి–నరసాపురం(07063) స్పెషల్ ట్రైన్‌కు సంబంధించి అక్టోబర్ 19న 195, అక్టోబర్ 26న 437, నవంబర్ 2న 466, నవంబర్ 9, 16, 23, 30 తేదీల్లో ఒక్కో రోజుకు 470 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇక సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07039) ట్రైన్‌లో అక్టోబర్ 21న 354, అక్టోబర్ 28న 712 బెర్తులు ఖాళీగా ఉండగా.. దీపావళికి ఇంటికెళ్లేవారికి నవంబర్ 4న 759, నవంబర్ 11న 777, నవంబర్ 18న 775, నవంబర్ 25న 765 బెర్తులు అందుబాటులో ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us