
సాధారణంగా మనకు డబ్బు అవసరం అయితే మనం చేసే పని అప్పు తీసుకోవడం. చిన్న అమౌంట్ అయితే తెలిసిన వాళ్లని అడిగి అడ్జెస్ట్ చేసుకుంటాం. కాస్త పెద్ద అమౌంట్ అయితే వడ్డీకి తీసుకుంటాం. కానీ, బయట ప్రైవేట్‌గా తీసుకుంటే వడ్డీ తడిసిమోపెడు అవుతుంది. అలా కాకుండా మనకు ఎంతో నమ్మకం అయిన అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ అయితే తక్కువ వడ్డీకి అప్పు ఇస్తుంది. అలాంటి ఓ స్కీమ్‌ను ఎస్‌బీఐ తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు.. కేవలం పాత కస్టమర్లకే. ఆ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SBI తీసుకొచ్చిన ఆఫర్ పేరు బ్యాంక్ RTXC (రియల్-టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్) ఆఫర్. కేవలం రూ.2 లక్షలు మాత్రమే కాకుండా రూ.35 లక్షల వరకు అందిస్తుంది. SBI ప్రత్యేక కస్టమర్ల కోసం ఈ రియల్-టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ (RTXC) ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద కస్టమర్లు YONO యాప్ ద్వారా రూ.35 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందోచ్చు. ఈ ఆఫర్ ప్రత్యేకత ఏంటంటే.. ఈ లోన్ కోసం ఎలాంటి పేపర్స్ అవసరం లేదు.
మీరు మీ మొబైల్‌లోని YONO యాప్‌ని ఉపయోగించి ఈ లోన్ కోసం ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. తరువాత మీరు మీ ఆధార్ OTPని ఉపయోగించి ఇ-సైన్ చేయవచ్చు. వడ్డీ రేట్లు 2 సంవత్సరాల MCLRతో లింకై మొత్తం లోన్ కాలానికి నిర్ణయించబడుతుంది.
ఈ ఆఫర్ SBIలో సాలరీ అకౌంట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం, డిఫెన్స్, కార్పొరేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ప్రకారం CIBIL స్కోర్ చెక్ చేయడంతో పాటు, అర్హత, లోన్ ఆమోదంతో సహా అన్ని ప్రక్రియలు డిజిటల్‌గా జరుగుతాయి. అలాగే మీ ప్రతినెల ఆదాయం కనీసం రూ.15వేలు ఉండాలి. మీ CIBIL స్కోరు 650 లేదా 700 కంటే ఎక్కువగా ఉండాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి