SBI Clients: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..! బేస్ రేటు తగ్గించిన బ్యాంక్‌

|

Sep 14, 2021 | 9:49 PM

SBI Clients: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI బేస్ రేటును తగ్గించడానికి నిర్ణయం తీసుకుంది. 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05 శాతం తగ్గించనుంది.

SBI Clients: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..! బేస్ రేటు తగ్గించిన బ్యాంక్‌
Sbi
Follow us on

SBI Clients: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI బేస్ రేటును తగ్గించడానికి నిర్ణయం తీసుకుంది. 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05 శాతం తగ్గించనుంది. దీంతో కొత్త వడ్డీ రేట్లు 7.45 శాతంగా ఉంటాయి. అదే సమయంలో రుణ రేటు (PLR) కూడా 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో మొత్తంగా 12.20 శాతానికి తగ్గినట్లవుతుందని బ్యాంక్ వివరించింది. కొత్త ధరలు సెప్టెంబర్ 15 నుంచి వర్తిస్తాయని ప్రకటించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేస్ రేటును నిర్ణయిస్తుంది. ప్రైవేట్ బ్యాంక్‌ అయినా ప్రభుత్వ బ్యాంక్‌ అయినా బేస్ రేటు కంటే తక్కువగా రుణాలను అందించదు. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు బేస్ రేటును ప్రామాణికంగా తీసుకుంటాయి. ప్రస్తుతం RBI బేస్ రేటు 7.30-8.80 శాతం మధ్య ఉంది. అయితే ఏప్రిల్‌లో SBI గృహ రుణాలపై కూడా వడ్డీ రేటును తగ్గించింది. ఇప్పుడు SBI 6.70 శాతం చొప్పున గృహ రుణాన్ని అందిస్తోంది. మహిళా రుణదాతలు 5 బేసిస్ పాయింట్ల ప్రత్యేక తగ్గింపు పొందుతున్నారు.

కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా తగ్గించింది
ప్రైవేట్ రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ గత వారం గృహ రుణాల వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.15 శాతం తగ్గించింది. గృహ రుణ వడ్డీ రేటు 6.65 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింది. కస్టమర్లకు సరసమైన గృహ రుణ రేట్లు నవంబర్ 8, 2021 వరకు అందుబాటులో ఉంటాయి. గృహ రుణాల కోసం కొత్త వడ్డీ రేటు సెప్టెంబర్ 10 నుంచి అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 16 బ్యాంకులు, ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు వినియోగదారులకు ఏడు శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తున్నాయి.

CM KCR: కరోనాతో కష్టాల్లో మెట్రో. ఆదుకోవాలంటూ ఉన్నతాధికారుల అభ్యర్థన.. సీఎం కేసీఆర్‌ ఏమన్నారంటే..

Talibans Rule: తమ పాలనలో నేరాలు చేస్తే విధించే శిక్షలను ప్రకటించారు తాలిబన్లు.. పనిష్మెంట్స్ ఇవీ..

Cancer: కేన్సర్ పరీక్షా విధానంలో సరికొత్త విధానం.. దీనితో వేగంగా వ్యాధిని తెలుసుకోవచ్చు..