PAN Aadhaar: పాన్ కార్డు, ఆధార్ లింక్ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు పొడగిస్తూ వచ్చింది. తాజాగా ఆధార్, పాన్ లింక్ చేసుకోవడానికి జూన్ 30తో ముగియనుండగా.. దానిని మరోసారి పెంచారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇదే విషయంపై తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఖాతాదారులు నిరంతర సేవలను పొందడానికి వెంటనే తమ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాలని సూచించింది. ఈ విషయమై ట్వీట్ చేసిన ఎస్బీఐ.. www.incometax.gov.in వెబ్సైట్లోకి వెళ్లి.. లింక్ ఆధార్ అనే లింక్‌లోకి వెళ్లి పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard pic.twitter.com/mcpTbolz2p
— State Bank of India (@TheOfficialSBI) June 27, 2021
ఇక ఆధార్-పాన్ లింక్ చేసుకున్న వారు కూడా అసలు తాము ఆధార్ లింకింగ్ చేశామా? లేదా అన్న డైలమాలో ఉన్నారు. మరి ఈ పాన్, ఆధార్‌తో లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది.
* ఇందుకోసం ముందుగా.. https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html వెబ్సైట్లోకి వెళ్లాలి.
* అనంతరం పేజీ ఓపెన్ కాగానే పాన్, ఆధార్ అనే రెండు బాక్సులు కనిపిస్తాయి.
* పాన్ అని ఉన్న బాక్సులో పాన్ నెంబర్‌ను, ఆధార్ నెంబర్ బాక్సులో ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
* తర్వాత వ్యూ లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. ఒకవేళ మీ ఆధార్, పాన్‌తో లింక్ అయితే. యూవర్ పాన్ లింక్డ్ టు ఆధార్ నెంబర్ అని చూపిస్తుంది.
kajal aggarwal : విడుదలకు సిద్దమవుతున్న కాజల్ సినిమా.. ఇన్నేళ్ల తర్వాత ఓటీటీలోకి..