
కరెంట్, గ్యాస్ లేదా వాటర్ బిల్లు సేవలు పొందేందుకు మీ KYCని అప్‌డేట్ చేసుకోవాలంటూ మీకు అత్యవసర కాల్ లేదా మెసేజ్ వచ్చిందా..? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. అది సైబర్ స్కామ్ కావచ్చు. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు సేకరించడం, డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు స్పామ్ లింకుల పంపిస్తారు. వాటిని లింక్ చేసి మీ వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు ఇవ్వడం వల్ల డబ్బులు కోల్పోయే అవకాశముంది. యుటిలిటీ సర్వీస్ ప్రొవైడర్ల అధికారులమని చెబుతూ అనుమానాస్పద లింక్‌ల ద్వారా మీ KYC వివరాలను అప్‌డేట్ చేయాలని, బిల్లు చెల్లించాలని కోరతారు. ఇలాంటి కాల్స్, మెస్సేజులు, స్పామ్ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.
అనుమానాస్పద కాల్స్‌ను విశ్వసించే ముందు లేదా తెలియని లింక్‌లపై క్లిక్ చేసే ముందు ఎందుకు? అని ప్రశ్నించాలని ఎస్బీఐ ఓ ట్వీట్ చేసింది. ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని సూచించింది. బిల్లు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని, సేవలకు అంతరాయం కలగవచ్చని భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. దీని ద్వారా ఓటీపీలు, పిన్‌లు, వ్యక్తిగత వివరాలు పంచుకోవాని బలవంతం పెడతారు. వీటి ద్వారా అమాయకపు ప్రజల నుంచి డబ్బులు కాజేస్తారు. తెలియని వ్యక్తి కాల్ చేసి కేవైసీ అప్డేట్ చేయమని అడిగినా లేదా బిల్లు చెల్లించమని అడిగినా వారి వివరాలు నిర్దారించుకోండి. నిజమో.. కాదో తెలుసుకోండి. త్వరగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, బిల్లు చెల్లించాలని కోరితే తక్షణమే చర్యలు తీసుకోవద్దు.
అనుమానాస్పద లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. వాట్సప్ ఫార్వర్డ్ లింకులప ట్ల అప్రమత్తంగా ఉండాలి. అటాచ్‌మెంట్‌లను డౌన్ లోడ్ చేసుకోవడం, వ్యక్తిగత వివరాలు లేదా ఓటీటీలు, సీవీవీలు, ఏటీఎం పిన్‌లు వంటి వివరాలను పంచుకోవద్దు. అధికారిక ఫ్లాట్‌ఫామ్స్, యాప్‌ల ద్వారా మాత్రమే బిల్లులు చెల్లించండి. గ్యాస్ కేవైసీ, ఇతర కేవైసీ లాంటివి అధికారిక వెబ్ సైట్ల ద్వారా మాత్రమే పూర్తి చయండి. అత్యవసరంగా చెల్లించాలని నోటిఫికేషన్ వచ్చినా కంగారు పడకండి. చెల్లింపులు చేసేముందు వివరాలను ధృవీకరించుకోండి. ఆందోళన పడి లింకులు క్లిక్ చేయడం వల్ల మీ వ్యక్తిగత వివరాలు లీక్ కావడంతో పాటు మీ డబ్బులు కోల్పోయే అవకాశముంది. దీంతో ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు అత్యంత జాగ్రతగా ఉండాలని స్టేట్ బ్యాంప్ ఆఫ్ ఇండియా సూచిస్తోంది. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.