LPG: గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే.. ఈ వంటలు అస్సలు వండకండి!

గ్యాస్‌ను ఆదా చేయడానికి కొన్ని వంట పద్ధతులను మార్చుకోవాలి. డీప్ ఫ్రై, ఎక్కువ సమయం ఉడికే వంటలు, నేరుగా మంటపై చేసేవి గ్యాస్‌ను ఎక్కువగా వినియోగిస్తాయి. వీటి బదులుగా తక్కువ నూనెతో, త్వరగా అయ్యే వంటలు, ప్రెషర్ కుక్కర్‌ను వాడటం ద్వారా గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

LPG: గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే.. ఈ వంటలు అస్సలు వండకండి!
Gas Saving Tips

Updated on: Mar 29, 2026 | 8:30 AM

ప్రస్తుతం గ్యాస్‌ దొరకడం కష్టమైన తరుణంలో చాలా మంది గ్యాస్‌ను పొదుపుగా వాడాలని ఫిక్స​్‌ అయ్యారు. మీరు కూడా అలాగే అనుకుంటూ ఉంటే ఇప్పుడు చెప్పబోయే వంటలు అస్సలు వండకండి. గ్యాస్‌ను ఎక్కువ రోజులు ఉపయోగించుకోవాలంటే వంటలో కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎక్కువ సమయం పట్టే, ఎక్కువ మంట అవసరమయ్యే వంటలను తగ్గిస్తే గ్యాస్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది.

పకోడీలు, పూరీలు, బజ్జీలు వంటి డీప్ ఫ్రై వంటలు ఎక్కువ నూనెతో పాటు ఎక్కువ సమయం మంటపై ఉంచాల్సి ఉంటుంది. దీనివల్ల గ్యాస్ వినియోగం అధికంగా ఉంటుంది. వీటి బదులుగా తక్కువ నూనెతో తయారయ్యే వంటలను ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. దాల్, మాంసం కూరలు, బిర్యానీ వంటి వంటలు ఎక్కువ సమయం ఉడికించాల్సి వస్తుంది. ముఖ్యంగా తక్కువ మంటపై ఎక్కువసేపు ఉంచే వంటలు గ్యాస్‌ను వేగంగా ఖాళీ చేస్తాయి. వీటిని తరచుగా చేయకుండా పరిమితం చేయడం మంచిదని చెబుతున్నారు.

చపాతీ, రోటీ, లేదా వంకాయ భర్తా వంటి వంటల్లో నేరుగా మంటపై కాల్చడం వల్ల గ్యాస్ ఎక్కువగా వినియోగమవుతుంది. వీటి బదులుగా పాన్ లేదా తవ్వా ఉపయోగించడం ద్వారా గ్యాస్ సేవ్ చేయవచ్చు. ప్రెషర్ కుక్కర్ ఉపయోగిస్తే వంట సమయం తగ్గి గ్యాస్ వినియోగం తగ్గుతుంది. ప్రత్యేకంగా దాల్, అన్నం, కూరలు వంటి వంటలను కుక్కర్‌లో తయారు చేయడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది. గ్యాస్‌ను ఎక్కువ రోజులు ఉపయోగించుకోవాలంటే వంటల ఎంపికలో జాగ్రత్త అవసరం. ఎక్కువ సమయం పట్టే, ఎక్కువ మంట అవసరమయ్యే వంటలను తగ్గించి, త్వరగా పూర్తయ్యే వంటలను ఎంచుకుంటే గ్యాస్ వినియోగాన్ని సమర్థంగా నియంత్రించవచ్చు. చిన్న మార్పులు పెద్ద ఆదాకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us