AC: ఏసీ వాడకంలో ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. మీ కరెంటు బిల్లు సగానికి తగ్గించుకోవచ్చు.. ఎలా అంటే

ఎండల వేడికి తట్టుకోలేక ఏసీ ఎక్కువగా వాడుతున్నాయి.. నెల తిరిగేలోపు కళ్లు చెదిరే కరెంటు బిల్లు వస్తుందా?.. అయితే ఈ వార్త మీ కోసమే.. మీరు ఏసీని సరైన పద్దితిలో వాడకపోవడం వల్లే కరెంటు బిల్లు ఎక్కవగా వస్తుంది. కాబట్టి ఏసీ జీవిత కాలం పెరగాలన్నా, కరెంటు బిల్లు తగ్గాలన్నా.. ఏసీని సరైన పద్దతిలో ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

AC: ఏసీ వాడకంలో ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. మీ కరెంటు బిల్లు సగానికి తగ్గించుకోవచ్చు.. ఎలా అంటే
Save Ac Electricity Bill

Updated on: Jun 11, 2026 | 3:47 PM

వేసవి కాలం ముగుస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మాత్రం ఇంకా తగ్గట్లేదు. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో ఇప్పటీ 44 నుంచి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేడి నుంచి తట్టుకోవలంటే మనకు ఏసీ తప్పకుండా ఉండాల్సిందే. అయితే ఏసీని సరైన పద్దతిలో వాడకపోతే.. నెల తిరిగేలోపు వచ్చి కరెంటె బిల్లు షాక్ ఇవ్వడామే కాకుండా ఏసీ కూడా పాడయ్యే అవకాం ఉంది. కాబట్టి కరెంటు బిల్లు ఎక్కవ రాకుండా,ఏసీ పాడవకుండా ఉండేందుకు నిపుణులు ఒక సూత్రాన్ని చెప్పారు. అదె 20 డిగ్రీస్ నియమం. ఏంటి ఈ నియం ఇది ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారా.. అయితే చూద్దాం పదండి.

20 డిగ్రీల నియమం అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది

ఈ నియమం ప్రకారం.. బయట ఉన్న వాతావరణ ఉష్ణోగ్రత కంటే మీ ఏసీ లోపల సెట్ చేసే ఉష్ణోగ్రత గరిష్టంగా 20 డిగ్రీల ఫారెన్‌ (సుమారు 11°C) మాత్రమే తక్కువగా ఉండాలి. ఎందుకంటే సాధారణంగా ఇళ్లలో వాడే ఏసీలు బయట ఉష్ణోగ్రత కంటే 20 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ చల్లదనాన్ని ఒకేసారి ఇవ్వడానికి డిజైన్ చేయబడవు. ఉదాహరణకు బయట ఎండ 100 డిగ్రీల ఫారెన్ హీట్స్ ఉందనుకుంటే ఈ నియమం ప్రకారం మీరు ఏసీని 80డిగ్రీల ఫారెన్ అంటే 26°C లేదా 27°C వద్ద ఏసీని సెట్ చేయాలి. ఒక వేళ మీరు దాని కంటే తక్కవ సెట్ చేస్తే రూమ్ కూల్ అవ్వడానిక ఏసీ నాన్‌స్టాప్‌గా నడుస్తూ ఉంటుంది. దీని వల్ల ఎక్కవ కరెంటు కాలడంతో పాటు కంప్రెషర్‌పనై భారం పడి ఏసీ త్వరగా పాడైపోవచ్చు.

సింపుల్‌గా చెప్పాలంటే

బయట 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఏసీని మనం 24 లేదా 25కి డిగ్రీ సెల్సియస్ వద్ద సెట్ చేసుకోవాలి. చాలా మంది నిపుణులు కూడా ఏసీని 24°C వద్ద ఉంచి వాడడం మన ఆరోగ్యానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. దీని వల్ల కరెంటు బిల్లును కూడా చాలా వరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు.

కరెంటు బిల్లు ఎలా తగ్గుతుంది

సాధారణంగా ఒక రోజులో 8 గంటల పాటు ఏసీ నాన్‌ స్టాప్‌గా తిరిగితే వచ్చే కరెంటు బిల్లు కంటే ఈ నియమం పాటిస్తే రోజంతా వాడితే వచ్చే బిల్లు మూడు రేట్లు తగ్గుతుంది. అంతేకాదు ఏసీ కూడా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. అలాగే మీకు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఒక వేళ మీరు ఈ నియమం వాడకపోతే ఏసీల జీవిత కాలం సగానికి సగం తగ్గిపోతుంది. ఉదాహరణకు 10 ఏళ్లు వచ్చే ఏసీ కేవలం ఐదేళ్లకు మూలకు పడుతుంది.

కరెంటు బిల్లు తగ్గించే ఇతర మార్గాలు

ఇదొక్కటే కాదు మనం కొన్ని చిట్కాల వల్ల కూడా కరెంటు బిల్లును తగ్గించుకోవచ్చు. ఇంట్లో ఎండ నేరుగా పడకుండా కిటికీలకు బలమైన కర్టెన్స్ వేయాలి. దీని వల్ల ఇంట్లో వేడిని తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా ఇంట్లో అవనసరంగా లైట్లను వేసి ఉంచకండి. దాని వల్ల కూడా ఏసీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే ఇంట్లో కొన్ని మొక్కలు కూడా పెంచుకోండి ఇవి ఇంటి వాతావరణాన్ని చల్లబరుతుస్తాయి. ఈ చిట్కాలు పాటించడం వల్ల మీరు కరెంటు బిల్లు తగ్గించుకోవడంతో పాటు ఏసీ ఎక్కవ కాలం పనిచేసేలా చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us