Jio Electric Bicycle: జియో ఈవీ సైకిల్‌పై పుకార్ల షికార్లు.. తక్కువ ధరలో సూపర్ మైలేజ్

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయంటే వాటి క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే తక్కువ స్పీడ్‌తో వెళ్లే ఈవీ సైకిళ్లకు కూడా డిమాండ్ పెరగడంతో కొన్ని కంపెనీలు వాటి తయారీపై దృష్టి పెట్టాయి. తాజా జియో ఈవీ సైకిల్ రిలీజ్ చేస్తుంటూ కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Jio Electric Bicycle: జియో ఈవీ సైకిల్‌పై పుకార్ల షికార్లు.. తక్కువ ధరలో సూపర్ మైలేజ్
Jio Electric Bicycle

Updated on: Mar 06, 2025 | 2:54 PM

టెలికం పరిశ్రమలో విప్లవాత్మక విధానాలకు పేరుగాంచిన రిలయన్స్ జియో బడ్జెట్ అనుకూలమైన ఎలక్ట్రిక్ సైకిల్‌తో ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించనుందని సమాచారం. ఈ సమాచారం జియో కంపెనీ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం 2025 నాటికి 400 కి.మీ.ల రేంజ్, రూ. 30,000 ప్రారంభ ధరతో జియో ఈ-సైకిల్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణానికి అనువుగా ఉండేలా ఈ సైకిల్‌ను రూపొందిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియా బజ్ ప్రకారం ఈ సైకిల్ ధర వేరియంట్‌ను బట్టి రూ. 30,000 నుండి రూ. 50,000 మధ్య ఉంటుందని అంచనా

జియో ఎలక్ట్రిక్ సైకిల్ రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని, డౌన్‌టైమ్‌ను తగ్గిస్తుందని, వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. స్మూత్ యాక్సిలరేషన్, మల్టీ రైడింగ్ మోడ్‌లు (ఎకో, నార్మల్, స్పోర్ట్), వేగం, బ్యాటరీ స్థాయి, ట్రిప్ వివరాలను ప్రదర్శించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ సైకిల్ ప్రత్యేకతలుగా ఉన్నాయి. అధునాతన ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఈ సైకిల్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. అలాగే జీపీఎస్ ట్రాకింగ్, బ్లూటూత్, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. 

జియో ఈ-సైకిల్ అధునాతన స్పెసిఫికేషన్లతో ప్రారంభిస్తే జియో ఎలక్ట్రిక్ సైకిల్ భారతీయ ఈ-మొబిలిటీ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. కచ్చితంగా ప్రజలు ఈ-సైకిల్‌ను పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నంగా ఎంచుకుంటారు. అయితే టెలికం రంగంలో సంచలనాలకు కారణమైన జియో ఈవీ రంగంలో సంచలనాలకు తెర తీస్తుందో? లేదో? వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి