RTGS: ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు ఆర్టీజీఎస్ విధానంలో నగదు ట్రాన్స్ ఫర్ చేస్తుంటారా? అయితే ఆర్బీఐ ఇచ్చిన ఈ అప్ డేట్ మీకోసమే.. 

|

Apr 12, 2021 | 5:29 PM

బ్యాంకు ఖాతాదారులకు ఒక ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది ఆర్బీఐ. దీనిప్రకారం ఆర్టీజీఎస్ విధానంలో ఫండ్స్ షేర్ చేసుకునే వారికి ఈ నెలలో ఒకరోజు ఇబ్బందులు తప్పవు.

RTGS: ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు ఆర్టీజీఎస్ విధానంలో నగదు ట్రాన్స్ ఫర్ చేస్తుంటారా? అయితే ఆర్బీఐ ఇచ్చిన ఈ అప్ డేట్ మీకోసమే.. 
RTGS Services
Follow us on

RTGS: బ్యాంకు ఖాతాదారులకు ఒక ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది ఆర్బీఐ. దీనిప్రకారం ఆర్టీజీఎస్ విధానంలో ఫండ్స్ షేర్ చేసుకునే వారికి ఈ నెలలో ఒకరోజు ఇబ్బందులు తప్పవు. ఈనెల 18వ తేదీన ఆర్టీజీఎస్ కొద్దిగంటల పాటు పనిచేయదని ఆర్బీఐ వెల్లడించింది. టెక్నీకల్ అప్ గ్రేడ్ పనులు నిర్వహించాల్సి ఉన్నందున ఆరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఆర్టీజీఎస్ విధానం పనిచేయదు.

రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ గా చెప్పబడే ఆర్టీజీఎస్ పేమెంట్ విధానంలో ఒక ఎకౌంట్ నుంచి ఇంకో ఎకౌంట్ కు డబ్బులు వెంటనే పంపించుకోవచ్చు. ఈ విధానంలో ఎటువంటి ఆలస్యం లేకుండా బ్యాంకు నుంచి బ్యాంకుకు డబ్బులు వెంటనే ట్రాన్స్ ఫర్ అయిపోతాయి. అయితే, ఈ విధానంలో ఒకసారి డబ్బులు ట్రాన్స్ ఫర్ చూశాకా మళ్ళీ దానిని వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. ఈ ఆర్టీజీఎస్ విధానాన్ని గత సంవత్సరం డిసెంబర్ 14 న నిరంతరం అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతకు ముందు బ్యాంకు పనివేళల్లో మాత్రమే ఈ విధానం పనిచేసేది.

”ఆర్టీజీఎస్ విధానంలో ఒక టెక్నీకల్ అప్ గ్రేడ్ చేయబోతున్నాము. భవిష్యత్తులో ఆర్టీజీఎస్ మరింత మెరుగ్గా పనిచేసేందుకు.. టెక్నీకల్ గా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా అలాగే ఏదైనా విపత్తు ఎదురైతే వెంటనే రికవీ చేసుకునే విధానాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ టెక్నీకల్ అప్ గ్రేడ్ చేస్తున్నాం. ఏప్రిల్ 17, 2021వ తేదీ బ్యాంకు పనిగంటలు ముగిసిన తరువాత ఈ అప్ గ్రేడ్ పని మొదలవుతుంది.” అని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

Also Read: స్టాక్ మార్కెట్ల పాలిట ఓ శనిలా కరోనా…మరోసారి భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్లు

Jan Dhan Bank Account: మీ బ్యాంక్ ఖాతాను జన్‌ధన్ అకౌంట్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!