ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ అంటే యజమానులు, ఉద్యోగులు ఇద్దరూ విరాళంగా ఇచ్చే పదవీ విరమణ పథకంగా అందరూ భావిస్తారు. ఈపీఎఫ్ఓ స్కీమ్ గణనీయమైన పదవీ విరమణ కార్పస్‌ను అందిస్తుంది. అయితే ఈపీఎఫ్ అంటే బీమా పథకం అనే విషయంలో చాలా మందికి తెలియదు. నెలవారీ చందా చెల్లించే సభ్యుడు వారి సర్వీస్ మధ్యలో మరణిస్తే కుటుంబ సభ్యులు/నామినీ/చట్టపరమైన వారసుడికి ఈపీఎఫ్ఓ రూ. 7 లక్షల వరకు బీమాను అందిస్తుంది. 1976లో కేంద్ర ప్రభుత్వం క్రియాశీల ఈపీఎఫ్ ఖాతాదారుల కుటుంబ సభ్యులకు బీమా ప్రయోజనాలను అందించడం ప్రారంభించింది.
భారతదేశం అంటే యజమాని ఆధారంగా నడిచే కుటుంబ వ్యవస్థ. అయితే అనుకోని సందర్భంలో యజమాని మరిణిస్తే, ఒకవేళ అతడు ఉద్యోగం చేస్తున్నప్పుడు మరణిస్తే ఈపీఎఫ్ఓ వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడానికి ఈడీఎల్ఐ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈడీఎల్ఐ బీమా మొత్తం రూ. 7 లక్షల వరకు ఉంటుంది. ఇది ఉద్యోగి మరణానికి ముందు చివరి 12 నెలల్లో పొందిన జీతంపై ఆధారపడి ఉంటుంది. ఈడీఎల్ఐ పథకం కింద క్లెయిమ్ మొత్తం గత 12 నెలల్లో సగటు నెలవారీ జీతం కంటే 35 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ అది రూ. 7 లక్షలకు మించకూడదు. ఈ పథకం కింద కనీస ప్రయోజన మొత్తం రూ. 2.50 లక్షలుగా ఉంటుంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిబంధనల చట్టం, 1952 కింద నమోదు చేయబడిన అన్ని సంస్థలు ఆటోమెటిక్‌గా ఈడీఎల్ఐ అర్హత పొందుతాయి. వారు ఈ పథకానికి సభ్యత్వాన్ని పొందడంతో పాటు కనీసం రూ. 15,000 మూల వేతనంతో తమ ఉద్యోగులను నమోదు చేసుకోవడం తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఈడీఎల్ఐ స్కీమ్‌కు దరఖాస్తు చేయడానికి ప్రత్యేక పద్ధతి అంటూ ఏమీ ఉంటుంది. ఈపీఎఫ్ చందాదారులకు ఆటోమెటిక్‌గా ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈడీఎల్ఐ స్కీమ్‌కు యజమాని మాత్రమే ఉద్యోగి ప్రాథమిక జీతంలో 0.5 శాతం (గరిష్టంగా రూ. 75 వరకు) చెల్లిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి