Multibagger stock: కోవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్ కొత్త గరిష్ఠాలను తాకింది. మహమ్మారి తర్వాత రియల్ ఎస్టేట్ స్టాక్‌లు దాదాపు నాన్-పార్టీసిపెంట్స్‌గా మిగిలిపోయాయి. అయితే ఇటీవలి మార్కెట్ ర్యాలీలో 2021లో మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలో మంచి సంఖ్యలో రియల్ ఎస్టేట్ స్టాక్‌లు ప్రవేశించాయి. రాధే డెవలపర్స్ షేర్ వీటిలో ఒకటి. ఈ మల్టీబ్యాగర్ రియల్ ఎస్టేట్ స్టాక్స్. గత ఆరు నెలల్లో అప్పర్ సర్క్యూట్‌ను తాకుతుంది. గత వారంలో రాధే డెవలపర్స్ షేరు ధర రూ.309.60 నుంచి రూ.338లకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 9 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత నెలలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ.190 నుండి రూ.338కి పెరిగింది. ఈ కాలంలో 77 శాతం పెరిగింది. అదేవిధంగా గత ఆరు నెలల్లో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ 10.40 నుండి రూ.338కు చేరుకుంది. ఈ కాలంలో దాదాపు 3,150 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
రాధే డెవలపర్స్‌లో ఒక పెట్టుబడిదారుడు ఒక వారం క్రితం రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువ ఇప్పుడు ఈరోజు 1.09 లక్షలకు చేరుతుంది. అదేవిధంగా ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పటి రూ. 1.77 లక్షలకు చేరేది. అలాగే ఒక పెట్టుబడిదారుడు ఆరు నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లైతే దాని విలువ ఇప్పుడు రూ.32.50 లక్షలకు చేరింది.
Read Also.. Rakesh Jhunjhunwala: ఆ IPOలో పెట్టుబడి పెట్టిన మదుపరులకు షాక్.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను నమ్మి..