
ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ బుక్స్ లో ఒకటైన రిచ్ డాడ్ పూర్ డాడ్ ను రచించిన రాబర్ట్ కియోసాకి.. ఆర్థిక పరమైన విషయాలను ఎక్స్ లో పంచుకుంటుంటారు. రీసెంట్ గా ఆయన ప్రపంచ చరిత్రలో అతిపెద్ద క్రాష్ జరుగుతుందని.. నేను ముందే ఊహించాను అని ట్వీట్ చేశారు. కియోసాకి అంచనా ప్రకారం.. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను పొందే అవకాశం ఉందట. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో పాటు వెండి ధరలు ఇంకా ఆకాశాన్నంటుతాయట.
డబ్బుని సేవ్ చేయొద్దు పెట్టుబడి పెట్టండి అని నేను ఎప్పట్నుంచో చెప్తూ ఉన్నాను. చాలా సంవత్సరాలుగా నేను బంగారం, వెండి వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నాను. వాటి ధరలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నేను వెండి, ఎథెరియంలలో పెట్టుబడి పెట్టమని సూచిస్తున్నాను. ఫ్యూచర్ లో వీటి విలువ పెరుగుతూనే ఉంటుంది. వెండి, ఎథెరియం లాభాలు, నష్టాలను మాత్రమే కాకుండా.. ఉపయోగాన్ని కూడా అధ్యయనం చేయండి. మీ సొంత ఆర్థిక జ్ఞానంతో పెట్టుబడి పెట్టండి.అని ఆయన ఎక్స్ వేదికగా సూచించారు.
ఇక దీంతో పాటు ఆయన యూఎస్ డాలర్ విలువ క్రమంగా తగ్గుతోందని..ఈ సమయంలో స్టాక్స్, ఫండ్స్ అంత సేఫ్ కాదని అన్నారు. ఇదంతా అమెరికా ఎకానమీ నష్టపోవడం వల్లే జరుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఆయన వెండి, ఎథెరియంలో పెట్టబడి పెట్టమని సూచిస్తున్నారు. అయితే భారతదేశంలో వెండి ధరలు అంతర్జాతీయ ధరల కంటే ఎక్కువగా ఉన్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం దీనికి కారణం. భారత రూపాయి జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో పెట్టుబడుల విషయంలో ఆచి తూచి వ్యవహరించడం మేలు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి