దేశంలో1 రూపాయల జీతం తీసుకుంటున్న అత్యంత ధనిక IAS అధికారి ఎవరు? ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

|

Apr 07, 2024 | 5:43 PM

ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు మీరు తరచుగా సమాధానాలు విని ఉంటారు. భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ అని అందరికి తెలిసిందే. ఇది ఇప్పుడు జీకే ప్రశ్నగా మారింది. దేశంలోనే అత్యంత సంపన్న..

దేశంలో1 రూపాయల జీతం తీసుకుంటున్న అత్యంత ధనిక IAS అధికారి ఎవరు? ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Richest Ias Officer
Follow us on

ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు మీరు తరచుగా సమాధానాలు విని ఉంటారు. భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ అని అందరికి తెలిసిందే. ఇది ఇప్పుడు జీకే ప్రశ్నగా మారింది. దేశంలోనే అత్యంత సంపన్న ఐఏఎస్ అధికారి ఎవరో తెలుసా? సివిల్ సర్వీస్‌లో జీతం కొన్ని లక్షల రూపాయలు ఉన్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయలకు యజమానులు ఎలా అవుతారు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంటుంది.

అత్యంత ధనిక ఐఏఎస్‌ ఎవరు?

అమిత్ కటారియా భారతదేశంలోని అత్యంత ధనిక బ్యూరోక్రాట్లలో ఒకరు. 1 రూపాయి జీతం తీసుకునే IAS అధికారిగా ప్రసిద్ధి చెందాడు. అతని కుటుంబం గుర్గావ్‌లో నిర్మాణ కంపెనీలను కలిగి ఉంది. అలాగే ఇది కాకుండా అతని భార్య బాగా సంపాదిస్తున్న ఒక ప్రొఫెషనల్ పైలట్. తన జీవితాన్ని నడపడానికి సరిపడా ఆస్తులు ఉన్నాయని, జీతం ఏమిటని ప్రశ్నించగా.. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఐఏఎస్‌లో చేరానని, సంపాదించేందుకు కాదని చెప్పాడు. ఇప్పటికీ దేశానికి నిజాయితీగా సేవలందిస్తున్న అతికొద్ది మంది నిజాయితీ గల అధికారులలో ఆయన ఒకరు.

ఆస్తి ఎంత?

జూలై 2023 నాటికి కటారియా ఆస్తుల విలువ రూ. 8.80 కోట్లు. అలాగే ఈ ఆస్తి ద్వారా అతని వార్షిక ఆదాయం రూ. 24 లక్షలు. టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి అలవెన్స్‌లు మినహా ఐఏఎస్ అధికారులు నెలకు రూ.56,100 ప్రారంభ వేతనం పొందుతారు. క్యాబినెట్ సెక్రటరీకి, ఈ జీతం నెలకు రూ. 2,50,000 వరకు చేరవచ్చు. ఇది ఐఏఎస్ అధికారికి అత్యున్నత పదవి. ఐఏఎస్‌ అధికారులు గ్రేడ్ పే అని పిలువబడే అదనపు చెల్లింపును కూడా అందుకుంటారు. ఇది వారి పోస్ట్‌ను బట్టి మారుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి