Revolt EV bike: యువతే టార్గెట్‌గా రీవోల్ట్ కొత్త ఈ-బైక్.. లాంచింగ్ ఎప్పుడంటే..

|

Sep 15, 2024 | 3:49 PM

రివోల్ట్ కంపెనీ మంచి శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 17వ తేదీన కొత్త బైక్ విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. మీడియా ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే కొత్త బైక్ గురించి ఏ విషయాలు బయటపెట్టలేదు. విడుదల చేసిన రోజునే దాని గురించి అన్ని విషయాలు వెల్లడించనుంది.

Revolt EV bike: యువతే టార్గెట్‌గా రీవోల్ట్ కొత్త ఈ-బైక్.. లాంచింగ్ ఎప్పుడంటే..
Revolt Rv 400
Follow us on

ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్ల రంగంలో రివోల్ట్ మోటార్స్‌కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కంపెనీ విడుదల చేసిన బైక్ లంటే యూత్ లో విపరీతమైన క్రేజ్. ఆకట్టుకునే లుక్ తో అదిరే ఫీచర్లతో విడుదలయ్యే బైక్ లపై కుర్రకారు సర్రుమంటూ దూసుకుపోతుంటారు. ఈ నేపథ్యంలో రివోల్ట్ కంపెనీ మంచి శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 17వ తేదీన కొత్త బైక్ విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. మీడియా ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే కొత్త బైక్ గురించి ఏ విషయాలు బయటపెట్టలేదు. విడుదల చేసిన రోజునే దాని గురించి అన్ని విషయాలు వెల్లడించనుంది.

ఆర్‌వీ 400కు ఆదరణ..

రివోల్ట్ కంపెనీ నుంచి విడుదలైన ఆర్ వీ 400 మోటార్ బైక్ కు ఎంతో ఆదరణ లభించింది. ఆ మోడల్ బండి యువతకు చాలా బాగా నచ్చింది. దానికి అనుగుణంగానే విక్రయాలు జోరుగా జరిగాయి. గత ఐదేళ్లగా ఆ వాహనాన్ని రివోల్ట్ కంపెనీ విక్రయాలు జరుపుతోంది. ఇప్పుడు ఈవీ రంగంలో తన స్థాయిని మరింత పెంచుకునేందుకు కంపెనీ చ ర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మరో కొత్త మోడల్ ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేయనుంది. ఇది కూడా ఆర్ వీ 400 మాదిరిగానే ప్రజల ఆదరణ పొందుతుందని కంపెనీ భావిస్తుంది.

అందరికీ ఆసక్తి..

రివోల్డ్ విడుదల చేయనున్న కొత్త ఈవీ బైక్ గురించి వివరాలు ఏవీ వెల్లడి కాకపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ కంపెనికి చెందిన ఆర్‌వీ 400, ఆర్‌వీ 400 బీఆర్ జెడ్ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. వీటిలో ఆర్‌వీ 400 బీఆర్ జెడ్‌కు కొనుగోలుదారుల నుంచి ఆదరణ లభిస్తోందని సమచారం. ఈ రెండింటి డిజైన్, మెకానిక్ భాగాలు దాదాపు ఒకేలా ఉంటాయి. వీటిలో 3.24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లను ఏర్పాటు చేశారు. రేంజ్ విషయాన్ని పరిశీలిస్తే ఏకో మోడ్లో 150 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. సాధారణ మోడ్ లో 100 కిలోమీటర్లు, స్పోర్ట్ మోడ్ లో 80 కిలోమీటర్ల వరకూ వస్తుంది.

చార్జింగ్ సులువు..

ఆర్‌వీ 400, ఆర్‌వీ 400 బీఆర్ జెడ్ వాహనాలను చార్జింగ్ చేయడం కూడా వినియోగదారులకు చాలా సులువుగా ఉంటుంది. కేవలం 4 నుంచి 5 గంటల్లో వంద శాతం చార్జింగ్ చేసుకోవచ్చు. 3 కేడబ్ల్యూ (4 బీహెచ్ పీ) మిడ్ – డ్రైవ్ మోటారు ద్వారా పవర్ ఉత్పత్తి అవుతుంది. ఫీచర్ల విషయానికి వస్తే కంబైన్డ్ బ్రేకింగ్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ మెకానిజం, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి.

ఈవీలకు ఆదరణ..

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకూ ఎంతో విస్తరిస్తోంది. అనేక కొత్త మోడల్ వాహనాలు వచ్చి చేరుతున్నాయి. ప్రజల ఆదరణ బాగా ఉండడంతో తయారీ దారుల మధ్య పోటీ నెలకొంది. దీంతో కొత్త వాహనాలలో అనేక ఫీచర్లు, ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి, ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటోంది. కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్ కూడా కళకళలాడుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..