
భారతదేశంలో చాలా మంది బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నారు. డబ్బు జమ చేయడం.. డబ్బు లావాదేవీలు చేయడంతో సహా సేవలకు బ్యాంకు ఖాతా చాలా అవసరం. గతంలో మనం చేతిలో నగదుతో డబ్బు ఖర్చు చేసేవాళ్ళం. ఇప్పుడు అంతా మారిపోయింది. ప్రస్తుత యుగంలో బ్యాంకు ఖాతా లేకుండా ఆర్థిక లావాదేవీలు చేయలేనందున చాలా మంది బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంలోనే బ్యాంకు ఖాతాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Operation Sindoor: S-400 రక్షణ వ్యవస్థ అంటే ఏమిటి? దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకవుతారు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెబుతోంది?
మే 31, 2025 నాటికి బ్యాంకు ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అకౌంట్‌కు సంబంధించిన కేవైసీ పత్రాలు సమర్పించని వారిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది. ఈ పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త ప్రకటన ఎవరికి వర్తిస్తుంది? వారి బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ చేయని వారికి ఎలాంటి జరిమానాలు విధించనుందో చూద్దాం.
ఆర్‌బిఐ నియమాలు ఎవరికి వర్తిస్తాయి?
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) తీసుకున్న ఖాతాదారులు తమ పాలసీని యధావిధిగా కొనసాలంటే మే 31, 2025లోపు తమ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీసు అకౌంట్లో కనీసం రూ.436 ఉండేలా చూసుకోవాలి. ఈ మొత్తం ఆటో డెబిట్ విధానంలో మీ బ్యాంకు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి. మే 31 లోపు ఈ డబ్బు జమ చేయని వారి పాలసీ రద్దు అవుతుందని ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఈ పాలసీ తీసుకున్న వారు ఏడాదికి రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఈ నియమాలు వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది. అందుకే ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారు ఈ మొత్తాన్ని చెల్లించడం తప్పనిసరి.
జీవన్ జ్యోతి బీమా యోజన అంటే ఏమిటి?
ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో జీవన్ జ్యోతి బీమా యోజన ఒకటి. ఈ ప్లాన్‌లో మీరు రూ.436 వరకు జీవిత బీమా పొందవచ్చు. రూ.436 చెల్లించి 2 లక్షలు వరకు బీమా పొందవచ్చు. సంవత్సరానికి రూ.436 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణంగా ఈ స్కీమ్ తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే రూ.2 లక్షల బీమా నగదు పొందవచ్చు. ఈ పాలసీ ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు అమలులో ఉంటుంది.
ఇది కూడా చదవండి: Karachi Bakery: కరాచీ బేకరీ యజమాని ఎవరు? పాకిస్తాన్‌తో సంబంధం ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి