Reliance Jio: యూజర్లకు జియో గుడ్‌ న్యూస్‌.. ప్రీపెయిడ్‌ రీచార్జ్‌లపై 20 శాతం క్యాష్‌ బ్యాక్‌.. పూర్తివివరాలు..

Reliance Jio: ఇటీవల దాదాపు అన్ని టెలికం కంపెనీలు ప్రీపెయిడ్‌ ప్లాన్‌ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఉన్న చార్జీలతో పోలిస్తే ఏకంగా కొన్ని ప్లాన్స్‌పై ఏకంగా రూ. 100 వరకు పెంచేశాయి...

Reliance Jio: యూజర్లకు జియో గుడ్‌ న్యూస్‌.. ప్రీపెయిడ్‌ రీచార్జ్‌లపై 20 శాతం క్యాష్‌ బ్యాక్‌.. పూర్తివివరాలు..
Jio Cashback

Updated on: Dec 05, 2021 | 6:46 AM

Reliance Jio: ఇటీవల దాదాపు అన్ని టెలికం కంపెనీలు ప్రీపెయిడ్‌ ప్లాన్‌ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఉన్న చార్జీలతో పోలిస్తే ఏకంగా కొన్ని ప్లాన్స్‌పై ఏకంగా రూ. 100 వరకు పెంచేశాయి. ఇక తక్కువ ధరకే ఇంటర్‌నెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో కూడా చార్జీలు పెంచేశాయి. కొన్ని రీచార్జ్‌ ప్లాన్స్‌పై రూ. 100 పెంచేశాయి. ఇదిలా ఉంటే పెంచిన ధరలపై రిలయన్స్‌ క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కొన్ని రీచార్జ్‌ ప్లాన్స్‌పై జియో మార్ట్‌ క్యాష్‌ బ్యాక్‌ పేరుతో ఈ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు.

ఇందులో భాగంగా జియో మొత్తం మూడు రీచార్జ్‌ ప్లాన్స్‌పై ఈ ఆఫర్‌ అందించనుంది. రూ. 299, రూ.666, రూ.719 ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకుంటే 20 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నారు. ఇక రీచార్జ్ చేసుకున్న మూడు రోజుల్లోగా ఈ క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇదిలా ఉంటే ఈ ప్లాన్ల ధరలు గతంలో రూ.249, రూ.555, రూ.599 ఉండేవి. ఇక క్యాష్‌ బ్యాక్‌ రూపంలో వచ్చిన మొత్తాన్ని రిలయన్స్ రిటైల్ స్టోర్స్, జియో ఆన్‌లైన్‌, షాపింగ్ పోర్టల్స్‌లో ఉపయోగించుకోవచ్చు.రీచార్జ్‌ల ద్వారా యూజర్లు ప్రతీరోజు గరిష్ఠంగా రూ.200ల వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చని జియో వెల్లడించింది.

Also Read: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి..

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి..

Car prices: వచ్చే ఏడాది బాదుడే.. బాదుడు.. మరింత పెరగనున్న కార్ల ధరలు..!